47 ఏళ్ల వయసులో కేక పెట్టిస్తున్న నాగ్ హీరోయిన్.. తడిసిన పరువాలతో అందాల ఆరబోత!
Pooja Batra: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన హాట్ హీరోయిన్ పూజా బాత్రా. 47 సంవత్సరాల వయస్సు ఉన్నా.. అందం ఏ మాత్రం తగ్గని బాలీవుడ్ భామ పూజా బాత్రా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ హాట్‌గా ఫోజులిస్తూ వయ్యారాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ తెగవైరలవుతుంది. ఇంతకీ ఆ హాట్ వీడియో ఏంటో ఓ లూక్కేద్దాం..
కింగ్ నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో అలరించిన అందాల భామ పూజా బత్రా. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈ అమ్మడు అక్టోబర్ 27, 1976న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించింది. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే టాప్ మోడల్ గా మారింది. ఈ తరుణంలోనే అంటే.. 1993లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ ఫేమ్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పూజ బాత్రా.

అలా.. 1997 లో 'విరాసత్'అనే మూవీతో వెండి తెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలువడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సునీల్ శెట్టితో కలిసి 'భాయ్'లో నటించింది. ఆ తరువాత 'హసీనా మాన్ జాయేగీ', 'దిల్ నే ఫిర్ యాద్ కియా', 'కహిన్ ప్యార్ న హో జాయే', 'నాయక్: ది రియల్ హీరో', 'తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీ', 'తలాష్', 'సాజీష్' పలు సక్సెస్ సినిమాల్లో హీరోయిన్ నటించింది.
ఈ అమ్మడు పలు సౌత్ ఇండియన్ మూవీలో కూడా నటించింది. తెలుగులో హీరో నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో స్టెప్పులేసింది అందాల భామ పూజా బత్రా. ఇక సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ హాట్ బ్యూటీ.. తరువాత దాసరి అరుణ్ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా నటించింది. అలాగే.. తమిళ, మలయాళంలో పలు సినిమాలో నటించింది.
సినిమాలో బిజీగా ఉంటుండగానే పూజా బాత్రా వివాహం చేసుకుంది. యూఎస్ బేస్డ్ డాక్టర్ సోను ఎస్ అహ్లువాలియాతో పెళ్లి జరిగిన సంగతి తెలిసింది. అయితే .. ఇద్దరూ ఎంతో కాలం కలిసి జీవించలేక పోయారు. విడాకులు తీసుకున్నారు. అది తన హ్యాపీ మ్యారేజ్ కాదని, ఆ సమయంలో చాలా కష్టమైన పరిస్థితులు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నటుడు నవాబ్ షాతో సహజ జీవనం చేస్తున్నారు. ఈ అమ్మడు నిత్యం తన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులకు ఉత్సాహ పరుస్తుంటారు.
ఇదిలాఉంటే.. తాజాగా పూజా బాత్రా నెట్టింట్లో షేర్ చేసిన ఓ హాట్ వీడియో తెగ వైరల్ అయింది. పూజా బాత్రా ఓ కొండకోనల్లోని జలపాతాల్లో జలకాలాడోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ .. జలకాలాడుతూ తన రువాలతో పిచ్చెక్కిస్తున్న పూజా బాత్రా. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేసి.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది. ఈ వీడియోపై భారీగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.


Click it and Unblock the Notifications











