Happy Birthday Shilpa Shetty: 40 ఏళ్ల వయసులో అలా ఉండడానికి కారణం ఈ ఆసనాలే.. చూశారా?
'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. మోడల్‌గా తన జీవితాన్ని ప్రారంభించి నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకుంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉండడానికి ఫాలో అయ్యే యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం.

‘దడ్కన్’తో సూపర్ క్రేజ్
బాలీవుడ్‌లో 'బాజీగర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'దడ్కన్' సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'బిగ్‌బాస్' తో ఆ క్రేజ్ ను మరింత పెంచుకున్న ఆమె 'దిక్షియాయూన్' సినిమాతో నిర్మాతగా మారింది.

నౌకాసనం..
పడవ ఆకృతిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి దీనికి నౌకాసనం అని పేరు వచ్చింది. ఇది చేస్తే తొడలు, నడుము, మెడ, భుజాల కండరాలను బలంగా ఉండేలా చేస్తుంది. ఇక దీని వలన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగవుతుంది. అలాగే పొట్ట మీద ఉండే కొవ్వు కరుగుతుంది, అలాగే ఉదరం & క్లోమం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.

Array
దీని వలన కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ కావడమే కాక అన్ని దిగువ శరీర కండరాలు, భుజాలు బలంగా తయారవుతాయి. ఇక దీని వలన వేగం & చురుకుదనం పెరిగి మెదడు & శరీరం సరిగ్గా పని చేసేలా చేస్తాయి. ఇక ఈ ఆసనం వేయడం చాలా సులభం కూడా.

మండుకాసనం
ఇది మీ నాభి కేంద్రం పై దృష్టి పెడుతుంది. ఇది రెండవ మెదడు అని పిలువబడే మీ జీవిత శక్తి కేంద్రంగా కూడా ఉంటుంది. అన్ని బలహీనతలను ఎదుర్కోవటానికి మీకు శక్తినిచ్చే సామర్థ్యం ఈ ఆసనానికి ఉంటుంది. అందుకే వారు "మీ గట్ ఫీలింగ్ తో వెళ్ళండి" అని చెబుతుంటారు.

వైగ్రాసన
దీనినే టైగర్ పోజ్ అని అంటారు. ఇది చేయడం వలన కండరాలు బలంగా మారతాయి. ముఖ్యంగా వెన్ను, పొట్ట కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గి నాజూగ్గా కనిపిస్తారు.

పాద సంచలనాసన
ఈ ఆసనం పొట్ట కండరాలు, వెనుక వైపు కింద ఉండే కండరాలను బలపరుస్తుంది. ఇక ఇది హిప్ మరియు మోకాలి కీళ్ళకు మంచిది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది మరియు జీర్ణ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications











