అలాంటి వ్యక్తితోనే డేటింగ్ చేస్తా, వన్ లైఫ్ వన్ లవ్ అనేది చెత్తమాట: నిహారిక
నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ' సూర్యకాంతం' చిత్రం మార్చి 29 న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడ్డ నేపథ్యంలో వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా '60 సెకండ్స్ విత్ సూర్యకాంతం' అంటూ సరికొత్త ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నిహారిక తన వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాల గురించి వెల్లడించారు.

వన్ లైఫ్ వన్ లవ్ అనేది చెత్తమాట
మీ దృష్టిలో వరస్ట్ యాష్ ట్యాగ్ ఏమిటి? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... ‘‘వన్ లైఫ్ వన్ లవ్'' అనేది చెత్త యాష్ ట్యాగ్ అని సమాధానం ఇచ్చారు. నేను డిజే పెడి దానికి ‘డిజే కిలా' అనే పేరు పెడతాను అని సమాధానం ఇచ్చారు.

రెండ్రోజులైనా అలాగే ఉంటా, సెల్ఫిష్
స్నానం చేయకుండా 2 రోజులు ఉంటారా? అనే ప్రశ్నకు ‘అవును' అంటూ నిహారిక సమాధానం ఇచ్చారు. నేను సెల్ఫిష్ పర్సనల్ అని మరో ప్రశ్నకకు ఆన్సర్ ఇచ్చారు.

అలాంటి అబ్బాయితో డేటింగ్ చేస్తా
ఎలాంటి అబ్బాయితో మీరు డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. ‘‘నేను బాగా మాట్లాడతాను. నే చెప్పే విషయాలను ఆసక్తిగా వినే అబ్బాయితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాను' అని జవాబిచ్చారు.

ఫసక్
ఫసక్ అనే పదం మీద మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా... ‘ఈ పదం ఎలాంటి ఎమోషన్ కైనా సూటవుతుంది. కోపం, బాధ, సంతోషం అన్నింటికీ దీన్ని వాడొచ్చు' అని నిహారిక తెలిపారు.

మీరు చేయాలనుకుంటున్న క్యారెక్టర్
మీరు చేయాలనుకుంటున్న క్యారెక్టర్ ఏమిటి? అనే ప్రశ్నకు... ‘యే జవానీ హై దివానీ' సినిమాలో నైనా లాంటి పాత్ర చేయాలనుకుంటున్నాను. ‘సూర్యకాంతం'మూవీలో నా ఫేవరెట్ సీన్ ఇంటర్వెల్ సీక్వెన్ అని నిహారిక తెలిపారు.

సూర్యకాంతం
‘సూర్యకాంతం' చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు.. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణలో సినిమా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











