69 ఏళ్ల వయసులో కూడా తరగని అందంతో.. మెగాస్టార్‌తో బ్రేకప్‌తో అలాంటి విషాదంతో ఎవర్ గ్రీన్ హీరోయిన్!
దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటిన మొదటి తరం హీరోయిన్లలో రేఖ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. హిందీ సినీ తారలను వెనక్కి నెట్టి తొలి స్టార్ హీరోయిన్‌గా తన కంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. రేఖ డేట్ల కోసం స్టార్ హీరోలు వెయిట్ చేయడమే కాకుండా తమ కాల్షిట్‌ను మార్చుకోవడం జరిగేదని చెప్పుకొంటారు. అయితే తాజాగా ఆమె 69 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకొన్నది. అలాంటి వయసు పెరిగినా వన్నె తరగని ఈ అందాల భామ గురించిన వివరాల్లోకి వెళితే..
తమిళంలో అగ్ర నటుడు, సావిత్రి భర్త జెమినీ గణేషన్, పుష్పవల్లి దంపతుల గారాలపట్టి రేఖ. రేఖ అసలు పేరు భానురేఖ గణేషన్. 1958 సంవత్సరంలో ఇంటి గుట్టు సినిమాలో బాలనటిగా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రంగులరాట్నంలో నటించారు. ఆపరేషన్ జాక్ పాట్ నల్లి సీఐడీ 999 అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు.

ఇక దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకట్టుకొంటున్న ఈ అందాల భామ సావన్ బాదో అనే సినిమా ద్వారా 1970లో హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ముఖద్దర్ కా సికందర్ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉమ్రావ్ జాన్, మిస్టర్ నట్వర్‌లాల్, సుహాగ్, ఖుబ్ సూరత్, సిల్ సిలా లాంటి సినిమాలతో సినిమా ప్రపంచాన్ని శాసించింది.
అయితే స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమయంలోనే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే సమయంలో వారిద్దరి మధ్య జయా బాధురి ప్రవేశించింది. దాంతో అమితాబ్‌తో బ్రేకప్ అయింది. అలా ఆమె లవ్ అఫైర్ అలా విషాదంగా మారింది.
అయితే బ్రేకప్ నుంచి తేరుకొని వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లాడింది. అయితే పెళ్లి జరిగిన ఏడాదిలోపే ఆయన మరణించడంతో దాంపత్య జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురు హీరోలతో అఫైర్ రూమర్లు వచ్చాయి. కానీ అవి గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. అయితే అప్పటి నుంచి ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా, మీడియాకు దూరంగా ఎక్కువగా ఏకాంత జీవితం గడిపే రేఖ ముంబై ఎయిర్‌పోర్టులో కెమెరాలకు చిక్కింది. ఫోటోగ్రాఫర్ల కోరిక మేరకు ఆమె ఫోజులిస్తూ.. తన అందంతో కెమెరాను కట్టిపడేసింది. 69 ఏళ్ల వయసులో కూడా ఇంత అందమా? యంగ్ హీరోయిన్ల గ్లామర్‌ను తలదన్నేలా ఉందే అనే విధంగా గ్లామర్‌తో మెరుపులు మెరిపించింది.


Click it and Unblock the Notifications











