పొట్టి బట్టల్లో ధనుష్ మాజీ వదిన.. ఆ ప్లేస్‌లో టాటూ చూపిస్తూ రెచ్చిపోయిన అందాల భామ
సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ హాట్ హాట్ ఫోటోలకు ఫోజిలిస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవకాశాల కోసం ఏకంగా నాలుగు పదుల వయసులో అందాలను ఆరబోస్తూ ట్రెండ్ అవుతోంది. హీరోయిన్లకు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు మాత్రమే లైఫ్ టైమ్ ఉంటుంది. కానీ కొందరు వయసు మీద పడినా గ్లామర్ పరంగా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఫోటోలపై మీరు లుక్కేయండి.. .
సినిమా పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా దశాబ్దం తర్వాత పక్కన పెట్టేస్తారు హీరోయిన్లను. ఒకవైపు ఇండస్ట్రీలోకి యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటే, మరోవైపు సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పటికీ స్టార్ట్ డమ్ కోసం పాకులాడుతున్నారు. రీ ఎంట్రీ ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అవకాశాల కోసం లేటు వయసులో ఘాటుగా ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. అలాంటి హీరోయిన్లలో తాజాగా 7జీ బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా చేరిపోయారు.

7/జీ బృందావన కాలనీ మూవీతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సోనియా అగర్వాల్ ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందే ఎన్నో సినిమాల్లో నటించిన సోనియాకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ 2004లో వచ్చిన 7/g బృందావన కాలనీ మూవీ ఈ హీరోయిన్ ఫేట్ ను మార్చేసింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కాగా, అందులో సోనియా అగర్వాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ముందుగా తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యి, హిట్ గా నిలిచింది. ఇప్పటికి సోనియాను 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ గానే గుర్తు పెట్టుకున్నారు మూవీ లవర్స్. కానీ ఈ మూవీతో కేవలం వన్ టైం వండర్ గా మిగిలింది సోనియా అగర్వాల్. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 7/g బృందావన కాలనీ సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ నే పెళ్లి చేసుకుంది సోనియా అగర్వాల్. ఆయన తమిళ స్టార్ హీరో ధనుష్ సోదరుడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ దంపతుల దాంపత్యం ఎక్కువ కాలం సాగలేదు. కొన్నాళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 40 ఏళ్ల వయసులో అడుగు పెట్టిన సోనియా ఏమాత్రం తగ్గని గ్లామర్ తో కుర్రాళ్లకు వల వేస్తోంది.
హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇప్పుడు కూడా బోల్డ్ రోల్స్ చేయడానికి రెడీ అనే సిగ్నల్స్ పంపుతోంది మేకర్స్ కు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనియా తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. ఈ ఫోటోలలో సోనియా థైస్ వరకు మినీ డ్రెస్ ధరించి ఫోజులిచ్చింది. డ్రెస్ మోకాళ్ళపై వరకు ఉండగా, తొడలపై ఆమె వేసుకున్న టాటూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇలాంటి ఫొటోలతోనైనా సోనియాపై సౌత్ దర్శకుల కన్ను పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











