రెండో పెళ్లికి సిద్దమవుతున్న 7/G హీరోయిన్.. మళ్ళీ దర్శకుడితోనే లవ్ ట్రాక్?
సినిమా ప్రపంచంలో తారల జీవితాలు ఎప్పటికీ ఒకే తరహాలో ఉండవు. సక్సెస్ ఉన్నంతకాలం మెరుస్తూ కనిపించే తారలు ఆ తర్వాత మరి కొన్నాళ్ళకు ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం ఊహించని స్థాయికి పడిపోతుంటారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సోనియా అగర్వాల్ టాప్ నుంచి వెంటనే కిందకు పడిపోయింది. ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. 7/g బృందావన కాలనీ సినిమా ద్వారా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సోనియా అగర్వాల్ గురించి అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన రెండో పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

7/g బాక్సాఫీస్ హిట్
2002లోనే నీ ప్రేమకై సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సోనియా అగర్వాల్ ఆ తర్వాత కన్నడ తమిళ్ అని తేడా లేకుండా వివిధ భాషల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. 2004లో ఆమె భారీ స్థాయిలో సక్సెస్ రావడంతో అమ్మడికి మంచి అవకాశాలు వచ్చయు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/g బృందావన్ కాలనీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆ సినిమా యువతకు ఎంతగానో నచ్చింది.

విభేదాల కారణంగా విడాకులు
ఇక అదే సమయంలో సోనియా అగర్వాల్ దర్శకుడితో ప్రేమలో కూడా పడింది. 2006లో సెల్వా రాఘవన్ ను పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ మూడేళ్ళ వరకూ చాలా సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ 2010లో కొన్ని విభేదాల కారణంగా విడాకులు ఇచ్చింది. అప్పట్లో ఈ వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

సపోర్టింగ్ రోల్స్ మాత్రమే
ఇక సోనియా 2011లో వానం అనే సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కేవలం ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే చేసింది. ఇక 2017లో టెంపర్ సినిమా లో ఒక చిన్న సపోర్టింగ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ బ్యూటీకి అనుకున్నంతగా అవకాశాలు ఏమీ దక్కలేదు. కేవలం కొన్ని సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ వచ్చింది.

రెండో పెళ్లి?
అయితే సోనియా అగర్వాల్ 39 ఏళ్ళ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కథనాలు వెలువడుతున్నాయి. మళ్లీ ఈ బ్యూటీ ఒక దర్శకుడితోమే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ అయితే గట్టిగానే వస్తుంది. గతంలోనే సోనియా పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
Recommended Video

డోస్ ఎంత పెరుగుతున్న కూడా..
అయితే రెండో పెళ్లి కి సంబంధించిన వారిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. రూమర్స్ డోస్ ఎంత పెరుగుతున్న కూడా సోనియా అగర్వాల్ సైతం పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం సోనియా అగర్వాల్ తమిళంలో మూడు సినిమాలలో స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది. అంతే కాకుండా తెలుగులో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











