పూజా హెగ్డే బోల్డ్ సీన్ కట్.. బుట్ట బొమ్మకు సెన్సార్ షాక్!

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అంటే కేవలం అలాంటి సీన్స్ మాత్రమే ఉండేవి అన్నట్టు ఒక ముద్ర ఉండేది. ఈ ెస్ట్రన్ సంప్రదాయం అంతా అప్పట్లో హాలీవుడ్ లో బాగా హల్చల్ చేసేది కానీ మన ఇండియన్ సినిమా దగ్గర మాత్రం అలాంటి బోల్డ్ సీన్స్ అనేవి చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాగా ఈ సంప్రదాయం కాస్తా ఇపుడు మారిపోయింది. హాలీవుడ్ వాళ్ళు డోస్ తగ్గిస్తే మన వాళ్ళు పెంచుతూ వెళుతున్నారు.

మెయిన్ గా బాలీవుడ్ సినిమాలో అయితే బోల్డ్ సీన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. దీనితో హీరోయిన్స్ కూడా ఇలంటి సీన్స్ కి ఓకే చెప్తుండడం అందుకు సెపరేట్ ఛార్జ్ లు కూడా చేస్తుండడంతో మన దగ్గర ఈ బోల్డ్ సీన్స్ కామన్ అయ్యిపోయాయి. ఇక బిగ్ స్క్రీన్స్ పై ఇవి పెరిగిపోతు ఉంటే సెన్సార్ వారు మాత్రం అవి మితి మీరితే కత్తెర వేయక తప్పడం లేదు. ఇలా లేటెస్ట్ గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేకి సెన్సార్ షాకిచ్చినట్టుగా తెలుస్తుంది.

a bold scene got trimmed on pooja hegde this is the movie

గత కొన్నాళ్ల నుంచి పూజా హెగ్డేకి సరైన ఆఫర్స్ లేవు అనే మాట బాగా వినిపించింది. కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే మన తెలుగు సినిమా మినహా తమిళ్ హిందీలో తన నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ చిత్రాల్లో నటించిన ఓ సినిమాపైనే సెన్సార్ వారు వేటు వేసినట్టుగా తెలుస్తుంది.

కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా స్టార్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా "దేవ్" లో కనిపించనుంది. కాగా ఈ సినిమాలోనే పూజా హెగ్డేపై బోల్డ్ సీన్ ఉందట. దెబ్బకి ఈ సీన్ ని తీసేయాలని సెన్సార్ వారు అభ్యంతరం చెప్పినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సీన్ షాహిద్ కి పూజాకి నడుమ ఉండే రొమాంటిక్ సీన్ అన్నట్టు తెలుస్తుంది.

a bold scene got trimmed on pooja hegde this is the movie

మామూలుగా మరీ హాట్ గా ఉంటే తప్ప సెన్సార్ యూనిట్ నుంచి ఇలాంటి మొట్టికాయలు పడవు. మరి దాదాపు ఇద్దరిపై ఆ సీన్ సుమారు 6 సెకండ్స్ పాటు ఉంటుందట. సో మొత్తానికి ఈ సీన్ ని తీసేసినట్టే తెలుస్తుంది. కాగా ఇటీవల మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని నటించిన తమిళ చిత్రం "కంగువా"లో కూడా ఓ సాంగ్ లో టూ హాట్ గా ఉన్న సీన్స్ ని కూడా సెన్సార్ వారు కట్ చేయించిన సంగతి తెలిసిందే.

సో ఇలా మన స్టార్ బ్యూటీస్ చేస్తున్న బోల్డ్ స్టెప్స్ కి నైస్ గా సెన్సార్ యూనిట్ కత్తెరలు వేస్తున్నారు. దీనితో ఆడియెన్స్ కి అవి థియేటర్స్ లో మిస్ అయ్యిపోతున్నాయి. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన ఈ దేవ్ సినిమా ఈ జనవరి 31న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలు కాకుండా తమిళ్ లో విజయ్ నటిస్తున్న జన నాయగన్ అలాగే హీరో సూర్యతో రెట్రో వీటితో పాటుగా రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో కాంచన 4 లో కూడా నటిస్తుంది అని టాక్ ఉంది. ఇలా ఫైనల్ గా మళ్ళీ ఫుల్ బిజీ హీరోయిన్ గా పూజా హెగ్డే మారిపోయింది.

More from Filmibeat

Read more about: pooja hegde deva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X