జాన్వీకి 5 కోట్ల కారు గిఫ్ట్.. ఆ బిజినెస్ పర్సన్ ఎవరు? దేవర బ్యూటీ కార్ సీక్రెట్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత జాన్వి కపూర్ కు దక్షిణాదిన మరింతగా క్రేజ్ పెరిగింది. భారీ చిత్రాల్లో అవకాశాలను కూడా అందుకుంటుంది.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రానికి ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా విధితమే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జాన్వి కపూర్ కూడా తన షూటింగ్ పార్ట్ 2 పూర్తి చేసుకుంటుంది.

A Business Person gift 5 crore worth Car to Janhvi Kapoor

అయితే జాన్వి కపూర్ కు ఇండియాలోని మోస్ట్ బిజినెస్ పర్సన్ ఐదు కోట్ల రూపాయల విలువగల లంబోర్ఘిని కారును గిఫ్ట్ గా ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అనన్య బిర్లా ఆ కారు ను బహుకరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జాన్వి కపూర్ కు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుకరించింది ఎవరు అనేది అందరిలో ఆసక్తిని రేఖించే అంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మెన్ కుమార్ మంగళం బిర్లా కూతురే అనన్య బిర్లా కావడం విశేషం. ఆయన రూ.2150 కోట్ల వరకు ఆస్తులను కలిగి ఉన్నారు.

అనన్య బిర్లా బిజినెస్ పర్సన్ గా ఎదుగుతున్నారు. ఆమెకు ముంబైలో జటియా హౌస్ ను కలిగి ఉంది. దాని విలువ 425 కోట్లు ఉంటుందని సమాచారం. గ్లోబల్ గ్రేడ్ ఫార్ములాల తో మాయిశ్చరైజర్స్ ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేయిస్తుంది. అమెరికన్ స్కూల్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న ఆమె సింగర్ గాను గుర్తింపు పొందింది. ఇలా పలు రకాలుగా అనన్య బీర్ల గట్టిగానే సంపాదిస్తుంది. ఆమె ఆస్తుల నికర విలువ 1770 కోట్ల వరకు ఉంటుందని ఫోర్బ్స్ తెలియజేసింది. 30 ఏళ్లలోనే అనన్య బిర్లా అటు సింగర్ గాను ఇటు వ్యాపారవేత్తగాను క్రియాశీలక పాత్రలు పోషిస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ కు కార్ గిఫ్ట్ ఇవ్వడంతో వార్తల్లో నిలిచింది. కొత్త బ్యూటీ బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషన్ కోసం ఖరీదై బహుమతిని ఇచ్చినట్టు ప్రచారం.

ఇక అనన్యకు గిఫ్ట్ గా ఇచ్చిన లంబోర్ఘిని అత్యంత ఖరీదైన కారు. దాని విలువల అక్షరాల రూ.4.99 కోట్లు ఉంటుంది. టాక్స్ లు యాడ్ చేసే రూ.5 కోట్లకు పైనే విలువ ఉంటుంది. ఆ కారు V10 ఇంజిన్ ను కలిగి ఉండటం విశేషం. ఇది 3.8 సెకండ్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఇదే టాప్ స్పీడ్ పికప్ వెహికిల్. ఇక జాన్వీ కపూర్ దగ్గర మరిన్ని కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. లెక్సాస్ ఎల్ఎం (Lexus LM), బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5), మెర్సీడెస్ జీఎల్ఈ (Mercedes GLE), బెంచ్ ఏ- క్లాస్ (Benz A-Class) వంటి కార్లు దేవర బ్యూటీ కార్ గ్యారేజీలో ఉండటం విశేషం.

More from Filmibeat

Read more about: janhvi kapoor lamborghini peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X