Kangana Ranaut పై కేసు నమోదు.. రైతుల ఉద్యమాన్ని టెర్రిరిస్టులతో పోల్చడంపై ఆగ్రహం

సిక్కుమతస్థులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై కేసు నమోదు చేశారు. దేశ రాజధాని సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఖాలీస్థాన్ ఉద్యమంతో కంగన రనౌత్‌ పోల్చడంపై చేసిన ఫిర్యాదుపై ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగన రనౌత్ ఉద్దేశపూర్వకంగానే సిక్కులను ఖాళిస్థాన్ ఉద్యమంతో పోల్చారు. సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం వివాదానికి దారి తీసింది.

కంగన రనౌత్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చేసిన ఫిర్యాదు మేరకు ఖార్ సబర్బన్ పోలీసులు కేసు నమోదు చేసింది. కంగనపై ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. మత నమ్మకాలను, మతాన్ని కించపరిచే విధంగా ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశామని ఖార్ పోలీసులు పేర్కొన్నారు.

 A case filed on Actress Kangana Ranaut comments on Kisan Morcha

ప్రభుత్వాన్ని ఖాలీస్థాన్ టెర్రిస్టులు మరోసారి బలప్రయోగం చేయబోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకే ఒక మహిళా ప్రధాని వారిని ఆమె కాలిబూట్ల కింద నలిపి వేసింది. తన జీవితాన్ని పణంగా పెట్టి ఖాళీస్థాన్‌ టెర్రరిస్టులను దోమలను నిలిపినట్టు నలిపివేసింది. చివరకు దేశాన్ని విభజించకుండా చేయడంలో తన సత్తాను చాటుకొన్నది అంటూ కంగన రనౌత్ తన పోస్టులో పేర్కొన్నారు.

కంగనపై కేసు నమోదు నేపథ్యంలో సిక్కు మత సంఘం నేత మంజిదర్ సింగద్ సిర్సా, శిరోమణి అకాళీదళ్ నేతలు ఇటీవల మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌ను, మహారాష్ట్ర పోలీసులను కలిసి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X