"లైగర్" బ్యూటీని టార్చర్ చేసింది ఎవరు? .. ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్‌లోకి
ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ సినిమాకి వచ్చి చాలా మంది హీరోయిన్స్ పాగా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడూ ఉండే ట్రెండ్ నే కానీ ఇపుడు నార్త్ హీరోయిన్స్ తాకిడి సౌత్ లో మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలో బాగా ఉందని చెప్పాలి. అలా హిందీ సినిమా నుంచి తెలుగు హీరో, తెలుగు దర్శకునితో వర్క్ చేసిన టాప్ అండ్ యంగ్ హీరోయిన్స్ లో నటి అనన్య పాండే కూడా ఒకామె అని చెప్పాలి.
కాగా హిందీలో అనన్యకి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రం "లైగర్" భారీ డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. కాగా ఈ సినిమాలో అనన్య సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు సహా హిందీలో భారీ డిజాస్టర్ అయ్యింది.

కాగా ఈ యంగ్ బ్యూటీని ఒక ఆగంతకుడు చాలా డిస్ట్రబ్ చేసాడని చెప్పుకొచ్చింది. అయితే అనన్య హిందీలోనే తన కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా హిందీలో ఆమె ఎంట్రీ తర్వాత మంచి మార్కులు వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో పలు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే అవి తన దృష్టికి వచ్చినపుడు చాలా బాధ పడేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కానీ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఒక గుర్తు తెలియని యువకుడు తనకి ఫ్రెండ్ అంటూ ఓ అకౌంట్ క్రియేట్ చేసుకొని తనపై పని గట్టుకొని కావాలని నెగిటివ్ ప్రచారం చేసేవాడని అనన్య తెలిపింది. అతని కారణంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. అతను అనన్య క్లాస్ మేట్ అంటూ ఆమె సినిమాలోకి వచ్చాకా అన్నీ పచ్చి అబద్దాలు చెబుతుంది అని ప్రచారం చేసేవాడని ఆమె గుర్తుచేసుకుంది. ఈ పరిణామాలు తనని చాలా లో స్టేజ్ లోకి తీసుకెళ్లింది అని అనన్య తెలిపింది.

అయితే ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిన తాను అందులో నుంచి బయటకి వచ్చేందుకు ఒక థెరపీ కూడా తీసుకున్నాను అని ఆమె చెప్పింది. రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం "సిటిఆర్ఎల్" అనే సైబర్ థ్రిల్లర్ ఓటిటిలో రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
కాగా ఈ చిత్రాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇది కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో "కాల్ మీ బే" సిరీస్ తో వచ్చింది. అందులో హిట్ అయ్యిన తర్వాత ఇపుడు దీనికి సీజన్ 2 రాబోతుంది. ఇవి మినహా శంకర అనే సినిమాలో అనన్య నటిస్తుంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనన్యను వేధించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











