నిన్ను మ్యారేజ్ చేసుకోరు..ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు.. త్రిప్తి దిమ్రికి వార్నింగ్

సాధారణంగా సినిమా వాళ్ళు అంటేనే చాలా మందికి కొంచెం వేరే అభిప్రాయం ఉంటుంది. దాదాపు అన్ని ఇండస్ట్రీస్ లో కూడా ఒక నటుడు లేదా దర్శకుడు ఇంకా సినిమాలో స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయ్యిన వాళ్లలో చాలా వరకు చెప్పే మాటలు తాము ఎదుర్కొన్న అవమానాలు కూడా ఒకేలా ఉంటాయి. సినిమా వాళ్ళకి లైఫ్ ఉండదు, సినిమాల్లోకి వెళ్తానంటావ్ ఏంటి ఇలా చాలా అనుభవాలనే వారు చెప్పుకుంటారు.

అయితే ఇలాంటివి హీరోయిన్స్ విషయంలో ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ విషయంలో వారు తల్లిదండ్రులు ప్రోత్సాహం బాగానే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ అన్ని ఇండస్ట్రీ లలో కనిపిస్తున్నారు. కానీ అలా హీరోయిన్ అవుదాం ఇండస్ట్రీ లోకి వెళదాం అనుకునే అమ్మాయిలకు అది కూడా వారి కుటుంబం నుంచి అవమానాలు ఎదురవ్వడం అనేది బాధాకరమే..

a shocking fact about triptii dimrii life and insults from her relatives

ఇలా ప్రస్తుతం ఇండియా వైడ్ భారీ ఫేమ్ ని సొంతం చేసుకున్న త్రిప్తి దిమ్రి జీవితంలో కూడా దారుణమైన అనుభవాలు ఎదుర్కొంది అట. అది కూడా తన బంధువులు నుంచే అని తెలుస్తోంది. అయితే త్రిప్తి సినిమాల్లోకి వెళతాను అని తన కుటుంబంలో చెప్పినప్పుడు ఆమెని తన బందువులే ఎంతో హీనంగా మాట్లాడరట. నువ్ కానీ సినిమాల్లోకి వెళితే ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అసలు నిన్నెవరూ పెళ్లి చేసుకోడానికి రారు అంటూ ఎంతో అవమానకరంగా మాట్లాడేవారట.

కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అనిమల్ అనే ఒక్క సినిమాతో త్రిప్తి నేషనల్ వైడ్ క్రష్ గా మారిపోయింది. బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్ గా కూడా నిలిచి తనని హేళన చేసిన వారికి గట్టి సమాధానమే ఇచ్చింది అని చెప్పాలి. ఇలా ఈ సెన్సేషనల్ హాట్ బ్యూటీ లైఫ్ లో జరిగిన ఒక షాకింగ్ ప్యాక్ట్ అయితే బి టౌన్ లో వైరల్ గా మారింది.

a shocking fact about triptii dimrii life and insults from her relatives

ఇక రీసెంట్ గానే "బ్యాడ్ న్యూజ్" బోల్డ్ సినిమాతో పలకరించిన ఈ హాట్ బ్యూటీ ఆ సక్సెస్ తో తన రెమ్యునరేషన్ ని కూడా భారీ మొత్తంలో పెంచేసింది. అయినా కూడా త్రిప్తి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదట. ప్రస్తుతం సినిమాకి 10 కోట్ల మేర ఛార్జ్ చేస్తున్న త్రిప్తి ఇప్పుడు బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా వుంది. అలాగే ఈమె టాలీవుడ్ ఎంట్రీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు తెలుగు ఎంట్రీ ఇస్తుందో చూడాలి. అయితే ప్రస్తుతానికి ఐకాన్ స్టార్ భారీ సీక్వెల్ చిత్రం పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది నిజం అయితే ఇదే ఆమెకి తెలుగు ఎంట్రీ అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ కోసం అయితే పుష్ప ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: triptii dimri animal bad newz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X