కంగన విలాసవంతమైన ఆఫీస్ ఏ రేంజ్ లో ఉందో ఓ సారి చూడండి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. అది సినిమా అయినా సరే ఆఫీస్ అయినా సరే ప్రతీదీ స్పెషల్ గా ఉండాల్సిందే. తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన పాలీ హిల్స్ లో అమ్మడి ఆఫీస్ కూడా ప్రత్యేక ఆకర్క్షణగా నిలిచింది. మరి ఆ బిల్డింగ్ విశేషాలు ఏంటో ఓ సారి చూసేద్దాం.

పాలీ హిల్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ :
పాలీ హిల్స్ లో సుమారు రూ. 48 కోట్ల రూపాయిలు ఖరీదు చేసే ఈ బిల్డింగ్ నంబర్ 5 కంగనా విలాశవంతైమన ఆఫీస్. ఒక్క కంగనకే కాదు, ఈ దేశంలో చాలా మందికి ఇదే ఓ కలల ప్రపంచం కావచ్చు. ఈ బిల్డింగ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందట. పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీస్ స్పేస్ కు కాస్తంగా ఇరోపియన్ టచ్ ఇవ్వడంతో, ఈ బిల్డింగ్ రాజధామాన్ని తలపిస్తుంది అనడంలో సందేహమే లేదు.

మణికర్ణికా ఫిల్మ్స్ -
సినిమా ప్రొడక్షన్ లోకి కంగనా ఎంటరవ్వడంతో, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెను మార్పులు చోటుచేసుకుంటాని, సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నటిగా, డైరెక్టర్ గా, రైటర్ గా సత్తా చాటుకున్న కంగన.. మణికర్ణిక ఫిల్మ్స్ పేరిట ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. పాత భవంతిని పునర్నిర్మించి, దానికి తనదైన శైలిలో మెురుగులు దిద్దింది కంగన.

పాత, కొత్త తరం కలయిక -
భవంతిలో సరికొత్త హంగులకు పెద్దపీట వేస్తూనే, పాత తరం ఇంటీరియర్స్ కూ స్థానం కల్పించారు. సిబ్బంది ప్రకృతితో మమేకమయ్యే విధంగా ప్రతి గదిని ఎంతో అందంగా, హృద్యంగా డిజైన్ చేశారు. ఇక రైటర్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టేందుకు కావాల్సిన సకల సౌకర్యాలూ ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటూ మెడిటేషన్ రూమ్ కూడా ఉంది. కాబట్టి, సిబ్బంది తమ ఆలోచనలకు పదును పెట్టేందుకు కావాల్సినంత ఏకాంతం లభిస్తుందిక్కడ. ఇక సువిశాలమైన మేకప్ రూమ్, గంటగంటకూ రిఫ్రెష్ అయ్యేందుకు ఎక్కిడక్కడ కేఫటేరియాలు ఈ బిల్డింగ్ ప్రత్యేకత. ఏమైనా ఇన్ని హంగులు చూస్తుంటే, వెంటనే కంగన ఆఫీస్ లో జాయిన్ అయిపోవాలని ఉంది కదూ. కానీ, అది కాస్త కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే, కంగన అంత తేలిగ్గా నమ్మే మనిషి అసలే కాదు.


Click it and Unblock the Notifications











