నీ జ్ఞాపకాలు చెరిగిపోవు .. RIP My Baby అంటూ స్టార్ హీరోయిన్ కన్నీటి పర్యంతం

సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వీరిలో ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కపుల్ కూడా ఒకటి. ప్రేమలో మునిగి తేలిన ఈ జంట సడెన్‌గా తమ రిలేషన్ బయటపెట్టి షాకిచ్చారు. అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు నిక్కీ, ఆది. ప్రేమ వివాహం తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. ఒక విచిత్రం సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టిన ఆయన .. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా నటించాలనే గిరి గీసుకుని కూర్చోకుండా ఏ పాత్రనైనా అంగీకరించి దానికి జీవం పోశారు. స్టైలీష్ విలన్‌గానూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్, గుడ్ లక్ సఖి, క్లాప్, ది వారియర్, అజ్ఞాతవాసి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

aadhi pinisetty and nikki Galrani loss their pet dog

ఇకపోతే.. యాగవరాయనం నా కాక్క, మరగద నాణయం చిత్రాల్లో నిక్కీ గల్రానీతో కలిసి నటించారు ఆది పినిశెట్టి. ప్రముఖ కన్నడ నటి సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఇద్దరూ ప్రేమలో పడగా.. 2022 మేలో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాతి నుంచి ఫారిన్ ట్రిప్పులు, హాలిడే వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రెట్ చేసుకున్న వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోలు షేర్ చేశారు.

తన ప్రేమ, పెళ్లి, భార్యపై ఇష్టాన్ని పలుమార్లు పంచుకున్నారు ఆది పినిశెట్టి. మలుపు సినిమా షూటింగ్ సమయంలో తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, తొలుత తనే నాకు ప్రపోజ్ చేసిందని తెలిపారు. అయితే ఈ ప్రేమను అంగీకరించడానికి సమయం తీసుకున్నానని.. కుటుంబ సభ్యులతో డిస్కష్ చేసిన తర్వాత నా మనసులోని మాటను ఆమెకు చెప్పానని ఆది తెలిపారు. అలాగే పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా సమయం తీసుకున్నామని ఆది పినిశెట్టి గుర్తుచేసుకున్నారు.

ఇదిలాఉండగా.. నిక్కీ గల్రానీ ఈరోజు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దాదాపు 9 ఏళ్లు బిడ్డలాగా చూసుకున్న వారి పెంపుడు శునకం చనిపోవడంతో ఆది ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయారు. నీ అడుగుల ముద్రలు మా హృదయాల్లో స్థిరంగా ఉన్నాయని, అవి ఎప్పటికీ చెరిగిపోవని, బేబీ నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానంటూ నిక్కీ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన పెట్ డాగ్‌తో గడిపిన క్షణాలు, ఫోటోలను ఆమె పోస్ట్‌కు జత చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆది ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: aadhi pinisetty nikki galrani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X