సెక్స్ సీన్ చేస్తుండగా ఇబ్బంది పెట్టిన నిర్మాత... నటి సంచలన వ్యాఖ్యలు!

Recommended Video

Prakash Jha Made Me Uncomfortable While Filming Lipstick Under My Burkha Scene || Filmibeat Telugu

2017లో విడుదలైన 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. సినిమాలో చాలా వరకు అసభ్యకరమైన సీన్లు, శృతి మించిన శృంగార సన్నివేశాలు, బూతు పదాలు ఉండటంతో సెన్సార్ బోర్డ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని కత్తిరింపుల అనంతరం సినిమా థియేటర్లలోకి రాగా క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో లీలా అనే పాత్ర పోషించిన నటి అహనా కుమ్రా.. నిర్మాత ప్రకాష్ ఝా మీద సంచలన ఆరోపణలు చేశారు. శృంగార సన్నివేశాల్లో నటిస్తుండగా అక్కడే ఉన్న ప్రకాష్ ఝా తనపై కొన్ని కామెంట్లు చేశాడని, అతడి వల్ల తాను ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు తెలిపారు.

నిర్మాతను మందలించిన దర్శకురాలు

నిర్మాతను మందలించిన దర్శకురాలు

‘‘ప్రకాష్ ఝా చేసిన కామెంట్ల వల్ల తాను ఆ సీన్ చేసే సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. వెంటనే ఈ విషయాన్ని దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవకు చెప్పాను. ఆమె కలుగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ మందలించింది.'' అని అహనా కుమ్రా గుర్తు చేసుకున్నారు.

ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరణ

ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరణ

అలంకృత శ్రీవాస్తవ మందలించగానే ప్రకాష్ ఝా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతడి చేష్టలు, కామెంట్ల వల్ల నేను ఇబ్బంది పడుతున్న విషయం అతడు అర్థం చేసుకున్నాడని అహనా కుమ్రా తెలిపారు. మీరు ఇబ్బంది పడేంతగా ప్రకాష్ ఝా చేసిన ఆ కామెంట్ ఏమిటి? అనే విషయం చెప్పడానికి మాత్రం అహనా కుమ్రా నిరాకరించారు.

వివాదాస్పద సన్నివేశంలో అహనా కుమ్రా

వివాదాస్పద సన్నివేశంలో అహనా కుమ్రా

‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్రంలో అహనా కుమ్రా లీలా అనే పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆమె బ్యూటీపార్లర్ నడిపే యువతిగా నటించింది. ఇంట్లోవారు ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించడంతో బాయ్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొని దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి పెళ్లి చేడగొట్టుకోవాలనే ఆలోచనతో లీలా పాత్ర సాగుతుంది.

అహనా కుమ్రా

అహనా కుమ్రా

లక్నోలో పుట్టి పెరిగిన అహనా కుమ్రా ‘యుద్ధ' అనే మినీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఏజెంట్ రాఘవ్ అనే సీరియల్‌లో లీడ్ రోల్ చేసింది. తర్వాత సినిమాల వైపు అడుగులు వేసింది. ఇటీవల విడుదలైన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో ప్రియాంక గాంధీ పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X