చిరంజీవితో సినిమా అని సంబరపడ్డా.. కానీ, మరో హీరోయిన్ పేరు చూసి గుండె పగిలింది...

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా అంటేనే తెగ సంబురపడుతారు. అదే ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ అంటే ఏ నటి కూడా అస్సలు వదులుకోదు. కానీ ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ వచ్చి చేతులెత్తేసుకుపోయిందని తాజాగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో తన పేరు ఫైనల్ అయినప్పటికీ చివరి నిమిషంలో మరొకరికి అవకాశం వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోల్పోయిన ఆ నటి ఎవరో తెలుసా?

Also Read
మాది దేవుడిచ్చిన బంధం.. కళ్యాణ్ పడాల‌తో నా రిలేషన్ ఇదే..
మాది దేవుడిచ్చిన బంధం.. కళ్యాణ్ పడాల‌తో నా రిలేషన్ ఇదే..

ఆ సీనియర్ ఎవరో కాదు.. అలనాటి నటి ఆమని (Aamani) మరోసారి వార్తల్లో నిలిచారు. 90వ దశకంలో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, ఇప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం వంటి సినిమాలు ఆమె కెరీర్ లో మైలురాళ్లు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వైరలవుతోంది. అందులో ఆమె తన సినీ ప్రయాణంలోని ఒక పెద్ద మిస్ అయిన అవకాశాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Recommended For You
'కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించా'
'కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించా'
Aamani Missed Chiranjeevi Film Chance Emotional Story From Throwback Interview

మెగాస్టార్ చిరంజీవి పట్ల తనకు చిన్నప్పటి నుంచే ఉన్న అభిమానాన్ని ఆమని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూల్ రోజుల్లోనే ఆయన సినిమాలు చూసి ఫ్యాన్ అయిపోయానని, రాధ, విజయశాంతి వంటి హీరోయిన్లు చిరంజీవితో నటించిన సన్నివేశాలు చూసి తానూ ఒకరోజు ఆయన పక్కన హీరోయిన్‌గా కనిపించాలని కలలు కనేదాన్నని చెప్పారు. తన డ్రీమ్ హీరోతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేయాలని అప్పటినుంచే ఆశపడినట్లు తెలిపారు.

You May Also Like
'ఆ కారణంగా ఆఫర్స్ కోల్పోయా.. ఇండస్ట్రీలో ఆ పిచ్చి ఎక్కువే'
'ఆ కారణంగా ఆఫర్స్ కోల్పోయా.. ఇండస్ట్రీలో ఆ పిచ్చి ఎక్కువే'

ఆ కల నిజమయ్యే అవకాశం 'రిక్షావోడు' సినిమా రూపంలో వచ్చినట్లు ఆమని వెల్లడించారు. దర్శకుడు ఏ. కొండరామి రెడ్డి తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో హీరోయిన్‌గా తనను ఎంపిక చేశారని, ఆ వార్త విన్న వెంటనే ఎంతో ఆనందపడ్డానని తెలిపారు. డేట్స్ ఇచ్చి షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా దొరికిందని గుర్తుచేసుకున్నారు. "త్వరలో షూటింగ్‌లో కలుద్దాం" అన్న ఆయన మాటలు తనకు జీవితంలో మర్చిపోలేని క్షణాలని చెప్పారు.

ఆ 15 రోజులు నరకం చూశా.. బతుకుతానని అనుకోలేదు
ఆ 15 రోజులు నరకం చూశా.. బతుకుతానని అనుకోలేదు

అయితే, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదని ఆమని తెలిపారు. కొద్ది రోజులకే పేపర్‌లో అదే సినిమాలో హీరోయిన్‌గా నగ్మా పేరు కనిపించడంతో షాక్ అయ్యానని చెప్పారు. వెంటనే తన మేనేజర్‌ను సంప్రదించగా, దర్శకుడు మారిపోయారని, అందుకే హీరోయిన్‌ను కూడా మార్చేశారని తెలిసిందని వెల్లడించారు. ఆ క్షణం తనకు ఎంతో బాధ కలిగించిందని, చిరంజీవి పక్కన నటించే అవకాశం చేతుల మీదుగా జారిపోవడం ఇప్పటికీ మరిచిపోలేని సంఘటనగా మిగిలిపోయిందని అన్నారు.

Raaka: అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఇక యాక్షన్ సీన్స్‌తో బాక్సాఫీస్ బద్దలే..
Raaka: అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఇక యాక్షన్ సీన్స్‌తో బాక్సాఫీస్ బద్దలే..

ఇదిలా ఉండగా, తర్వాత మరోసారి చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఈసారి తానే ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆమని తెలిపారు. 'స్టాలిన్' సినిమాలో ఆయన అక్క పాత్ర కోసం తనను సంప్రదించారని, కానీ చిన్నప్పటి నుంచి డ్రీమ్ హీరోగా చూసిన వ్యక్తికి సిస్టర్‌గా నటించడం తన వల్ల కాలేదని స్పష్టం చేశారు. ఆ పాత్రను చివరకు కుష్బు చేశారు. తన కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేసి సంతృప్తిగా ఉన్నప్పటికీ, చిరంజీవితో ఒక సినిమా కూడా చేయలేకపోయాననే బాధ మాత్రం ఇప్పటికీ వెంటాడుతుందని ఆమని తెలిపారు.

Read more about: aamani chiranjeevi tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X