నటి ఆమని మేనకోడలు హీరోయిన్‌గా ఎంట్రీ... (గ్లామరస్ ఫోటోస్)

సినిమా రంగంలో టాలెంటుతో పాటు వారసత్వం కూడా తోడైతే ఇండస్ట్రీలో త్వరగా నిలదొక్కునే అవకాశాలు ఎక్కువ. ఇదే తరహాలో త్వరలో మరో బ్యూటీ వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం తల్లి పాత్రల్లో అలరిస్తున్న ఆమని కుటుంబం నుంచి ఓ అందమైన అమ్మాయి నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా విడుదలైన ఆ ఆమె ఫోటోలు కుర్రాళ్ల మతి పొగొడుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? అయితే కిందకి ఓ లుక్కేయండి.

ఆమని మేనకోడలు

ఆమని మేనకోడలు

ఆవిడ మరెవరో కాదు... ఆమని మేన కోడలు హృతిక. అయితే ఈ అమ్మడు తెరంగ్రేటం చేస్తుంది తెలుగు సినిమా ద్వారా కాదు... ఓ తమిళ చిత్రం ద్వారా ఆమె తెరంగ్రేటం చేయబోతున్నారు. సక్సెస్ కలిసొస్తే భవిష్యత్తులో తెలుగులో కూడా నటిస్తుందేమో?

మా అత్తయ్యలాగా పేరు తెచ్చుకోవాలి

మా అత్తయ్యలాగా పేరు తెచ్చుకోవాలి

మా అత్తయ్య ఆమని తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మా మామయ్య ఖాజామొయిద్దీన్‌ సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. వారి ఆశీస్సులతో నేను సినిమాల్లోకి వచ్చినట్లు హృతిక వెల్లడించారు.

సినిమాలపై ఇష్టంతోనే...

సినిమాలపై ఇష్టంతోనే...

చిన్నప్పటి నుంచి అత్తయ్య సినిమాలు చూసేదాన్ని, ఈ రంగంలోకి రావడానికి ఆమె నాకు రోల్ మోడల్. నటనపై ఆసక్తి ఎక్కువ. భరతనాట్యంతో పాటు వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకున్నట్లు హృతిక తెలిపారు.

పుట్టింది ఏపీలో, పెరిగింది చెన్నైలో

పుట్టింది ఏపీలో, పెరిగింది చెన్నైలో

పుట్టింది ఆంధ్రప్రదేశ్‌‌లో అయినా పెరిగింది చెన్నై అని, బెంగళూరులో చదువుకుంటున్నట్లు హృతిక మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆమె తన ఫోటోలు సైతం విడుదల చేశారు.

‘విడియాద ఇరవొండ్రు వేండుం'

‘విడియాద ఇరవొండ్రు వేండుం'

మురుగన్‌ దర్శకత్వంలో ‘విడియాద ఇరవొండ్రు వేండుం' అనే చిత్రం ద్వారా హృతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X