ఇంత వరకు ఏ హీరోయిన్ చేయలేదు: 20 రోజులు అమలా పాల్ నగ్నంగా...
Recommended Video
తమిళ చిత్రం 'ఆడై' తెలుగులో 'ఆమె' పేరుతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన అమలా పాల్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కథలోని తీవ్రత, ఇంటెన్సిటీ ప్రేక్షకులకు అర్థమవ్వాలనే ఈ న్యూడ్ సీన్ టీజర్లో ఫోకస్ చేశారు.

20 రోజుల పాటు అమలా పాల్ నగ్నంగా...
ఈ న్యూడ్ సీన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తవ్వడానికి మొత్తం 20 రోజుల సమయం తీసుకున్నారట. తమిళ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కూడా ఏకంగా 20 రోజుల పాటు వరుసపెట్టి న్యూడ్ సీన్లో నటించలేదని, అమలా పాల్ మాత్రమే ఇలాంటి సాహసం చేసిందని అంటున్నారు.

అమలా పాల్ మీద ప్రశంసలు
అమలా పాల్ నటించిన ఈ సీన్ గ్లామర్ షో ఏ మాత్రం కాదని, కథలో భాగంగా వచ్చే ఒక దారుణ సంఘటన నేపథ్యంలో ఈ సీన్ వస్తుందని అంటున్నారు. కథ కోసం ఇలాంటి సీన్ చేయడానికి ముందుకు వచ్చిన అమలా పాల్‌ను సినీ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు.

మహిళల స్వేచ్ఛ గురించి చర్చించే కథతో
మహిళలకు స్వేచ్ఛ ఏమేరకు ఉంది? స్వేచ్ఛ లభించిన వారు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా సమాజంలో మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే అంశం ప్రధానంగా చర్చిస్తూ ఈ మూవీ సాగుతుందట.
అమలా పాల్‌కు అవార్డు తెస్తుందా?
ఈ చిత్రంలో అమలా పాల్ నటనకు అవార్డులు ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.


Click it and Unblock the Notifications











