చిరుత పులి డ్రెస్‌లో అందాల పంజా .. ఆ ప్లేస్‌లో టాటూ చూపెడుతూ పుష్ప విలన్ గ్లామర్ షో!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ది రైజ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మాటలు, పాటలు, డైలాగ్స్, అల్లు అర్జున్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.1871 కోట్ల కలెక్షన్స్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో దంగల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. పుష్ప 2లో నటించిన వారందరికీ జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కింది. ఇలాంటి వారిలో ఆంచల్ ముంజల్ కూడా ఒకరు.
పుష్ప 2 సినిమాలో సిద్దప్ప నాయుడిని సీఎం చేయడం కోసం పుష్పరాజు ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఎర్రచందనం డీల్ చేస్తాడు. ఆ డీల్‌లో ఓ స్మగ్లర్‌గా నటించిన యానిమల్ నటుడు సౌరబ్ సచ్‌దేవ గర్ల్ ఫ్రెండ్‌గా కనిపించిన అమ్మాయి అప్పట్లో కుర్రాళ్లను నిద్ర పోనివ్వలేదు. ఆమె ఎవరు? సుకుమార్ ఎక్కడి నుంచి పట్టుకోచ్చాడు వంటి వివరాల కోసం ఆడియన్స్ ఇంటర్నెట్‌ను జల్లెడ పట్టారు. ఆమె పేరు ఆంచల్ ముంజల్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు ఆంచల్.

పుష్ప2 వంటి భారీ బడ్జెట్‌లో నటించడమే ఎంతో మంది కల. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్ది నిమిషాలే.. కనీసం ఒక్క డైలాగ్ కూడా ఆమెకు లేదు. అయినప్పటికీ చిత్ర సీమలో సంచలనం సృష్టించింది ఆంచల్. తన అందంతో యూత్‌ను కట్టిపడేసిన ఆంచల్ సొంతూరు హర్యానాలోని హిస్సార్. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో తొలుత సీరియల్స్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టి కెరీర్ ప్రారంభించింది. ధూమ్ మచావో ధూమ్, పర్వరిష్ వంటి ధారావాహికలు ఆంచల్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
బుల్లితెరపై అవకాశాలు వెల్లువెత్తగా అప్పుడే ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్‌లలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది. అలాగే మ్యూజిక్ పైనా ఆంచల్‌కు పట్టుంది. ఈమె చేసిన కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి ఆంచల్‌కు పిలుపొచ్చింది. 2010లో వుయ్ ఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అరక్షణ్, ఘాయల్ వంటి సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆంచల్ తన సినిమాలు, సీరియల్స్ ఇతర వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రీల్స్ చేసే అలవాటే ఆంచల్‌కు పుష్ప 2 ది రైజ్‌లో ఛాన్స్ తీసుకొచ్చింది. పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లి టైటిల్ ట్రాక్ రిలీజైనప్పుడు ఆ పాట మీద ఓ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ మరుసటి రోజు సుకుమార్ టీమ్ నుంచి ఆంచల్‌కు ఫోన్ వచ్చింది. తన ప్రొఫైల్ నచ్చడంతో పుష్ప 2లో నటించాల్సిందిగా అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే తొలుత ఇది ఫ్రాంక్ కాల్ అనుకుందట ఆంచల్. కానీ రెండోసారి ఫోన్ వచ్చేసరికి షాకైందట ఆంచల్. చిన్న పాత్రే అయినప్పటికీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొద్ది క్షణాలే కనిపించినప్పటికీ తన క్యూట్ లుక్స్ , అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది ఆంచల్.


Click it and Unblock the Notifications











