ఐశ్వర్యారాయ్ కూతురుకు తెలుగు హీరోయిన్ పోలికలు... ఆ తార మళ్ళీ పుట్టిందా?
స్టార్ కిడ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూతురును ఓ దివంగత స్టార్ హీరోయిన్ తో పోలుస్తున్నారు నెటిజన్లు. ఆమె బయోపిక్ తీయాలంటే ఈ స్టార్ హీరోయిన్ కూతురు పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆరాధ్య బచ్చన్ ఏ స్టార్ హీరోయిన్ పోలీకలతో ఉంది ? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.
సౌందర్య అనగానే ఆ ముగ్ధ మనోహర రూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె ఇప్పుడు మన కళ్ళ ముందు లేకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సౌందర్య. గ్లామర్ కి దూరంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చేస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

కానీ అనుకోని విధంగా విమాన ప్రమాదంలో కన్నుమూసి తెలుగు ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే సౌందర్య బయోపిక్ తెరపైకి వస్తే బాగుంటుంది అని చాలా కాలంగా మూవీ లవర్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటిదాకా సౌందర్య బయోపిక్ లో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనే చర్చ జరిగింది.
రష్మిక మందన్న పేరు సౌందర్య బయోపిక్ విషయంలో ఎక్కువగా వినిపించింది. అలాగే కొంత మంది హీరోయిన్లు సౌందర్య బయోపిక్ లో నటించాలి అని ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ తాజాగా ఓ స్టార్ కిడ్ తో నెటిజన్లు పెడుతున్న పోలికలు చూస్తుంటే ఈ ఛాన్స్ ఇప్పటిదాకా ఉన్న హీరోయిన్లు ఎవరికీ దక్కేలా కనిపించడం లేదు.
ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూతురు ఆరాధ్య గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం. ఆరాధ్య ఎక్కడ కనిపించినా ఆమెపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చదువుకుంటున్న ఆరాధ్య తరచుగా తన తల్లితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటిదాకా ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఆమెకు భారీ సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే కొందరు ఆరాధ్యను సౌత్ స్టార్ హీరోయిన్ అయిన సౌందర్య తో పోలుస్తున్నారు. సౌందర్య కెరీర్ తొలినాళ్ళ ఫోటోలు, ఆరాధ్య బచ్చన్ ఇప్పటి ఫోటోలను గమనిస్తే సౌందర్య కెరీర్ మొదట్లో ఎలా ఉండేదో అచ్చం ఆరాధ్య అలాగే కనిపిస్తుంది. దీంతో ఒకవేళ సౌందర్య బయోపిక్ తీయాలి అనుకుంటే ఆరాధ్య సరిగ్గా సరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది ఆరాధ్యలో సౌందర్యను చూసుకుంటూ ఆమె మళ్ళీ పుట్టిందా అని సంబరపడిపోతున్నారు. కాగా ఆరాధ్య తాత అయిన అమితాబ్ బచ్చన్ తో సౌందర్య సూర్యవంశం అనే సినిమాలో నటించింది. తన గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ప్రశంసలు అందుకున్న సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించిన సౌందర్య 2004 ఏప్రిల్ 7న విమాన ప్రమాదంలో మరణించింది.


Click it and Unblock the Notifications











