Aishwarya Rai: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. అసలేం జరిగిందంటే ?
Aishwarya Rai: బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో మొన్నటి వరకు పుకార్లు షికార్లు చేశాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని, వారి మధ్య విభేదాలు తలెత్తాయంటూ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఐశ్వర్య ఫ్యామిలీకి సంబంధించి మరో కొత్త పుకారు వస్తున్నాయి. దీంతో బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ కూతురు ఆధార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకీ ఏమైందంటే?
తాజాగా ఐశ్వర్య ఫ్యామిలీకి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. అయితే అది ఐశ్వర్య రాయ్ లేదా అభిషేక్ గురించి కాదు. వారి గారాల పట్టి, కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి. ఇటీవల ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆ రూమార్స్ పై బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బచ్చన్ ఫ్యామిలీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ కూతురు ఆరాధ్య హెల్త్ గురించి కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుంది.

కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే.. ఆరాధ్య ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి. కొంతమంది యూట్యూబర్స్ ఆరాధ్యపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆరాధ్య ఆరోగ్యం బాగాలేదని, ఆ విషయాన్ని బచ్చన్ కుటుంబం దాచేస్తుందని అంటూ ఇష్టం వచ్చినట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే.. ఆరాధ్య, ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఫేక్ న్యూస్,ఫేక్ వీడియోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి ఫేక్ న్యూస్ ను అరికట్టాలని డిమాండ్ చేసింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ నుండి డిలీట్ చేయాలని కోర్టు కోరింది. ఈ పిటిషన్ 2023 ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ సి. హరి శంకర్ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఆరాధ్య , అభిషేక్ బచ్చన్ తరఫు సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ కోర్టులో వాదించారు. యూట్యూబ్ (గూగుల్) తరపున న్యాయవాది మమతా రాణి హాజరయ్యారు. బార్ అండ్ బెంచ్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. కోర్టు గుగూల్ (యూట్యూబ్)ను ప్రశ్నించింది. సరైన సమాచారం అందించడం మీ బాధ్యత. అలాంటి విధానం సరైన నియమాలను పాటించడం లేదు. యూట్యూబ్ వీడియోలపై కోర్టు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని పేర్కొంది. ఇలాంటి నకిలీ వార్తలను ఆపడం యూట్యూబ్ బాధ్యత. అని పేర్కొంది.
తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానెళ్ల వివారాలను అందించాలని, అలాంటి వీడియోలను తొలగించాలని కోర్టు గూగుల్‌ను ఆదేశించింది. కానీ, గూగుల్ ఆ ఛానెళ్లపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని కారణంగా ఆరాధ్య మళ్ళీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆరాధ్య తల్లిదండ్రులుగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ ఢిల్లీ హైకోర్టులో కొత్త పిటిషన్ ను దాఖలు చేశారు.కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొంది ఆరాధ్య. దీంతో హైకోర్టు గూగుల్ కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ మార్చ్ 17న మరోసారి విచారణను రానున్నది.


Click it and Unblock the Notifications











