గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ వివాహం (ఫోటోస్)

Recommended Video

Okariki Okaru Movie Actress Aarti Chabria Ties The Knot || Filmibeat Telugu

హీరోయిన్ ఆర్తి చాబ్రియా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ విశరద్ బీడసేతో మూడు ముళ్లు వేయించుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం మీడియాకు పొక్కకుండా గోప్యత పాటించడం గమనార్హం. ముంబైలో సోమవారం(జూన్ 24)న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

వివాహ వేడుక అనంతరం ఆర్తి చాబ్రియా సన్నిహితులు వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. వీరిది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. పెద్దల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాతే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్

ఆర్తి చాబ్రియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆర్తి ఎరుపు రంగు లెహంగా ధరించి అందంగా మెరిసిపోయింది. వరుడు విశరద్ సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుక జరిగింది. మార్చి 11, 2019లో వీరు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

సినిమా రంగానికి చెందిన వ్యక్తికాదు

సినిమా రంగానికి చెందిన వ్యక్తికాదు

విశరద్ బీడసే సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఇంటర్నేషనల్ టాక్స్ కన్సల్టెంట్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు. త్వరలోనే ఇండియాకు షిప్ట్ అవుతారని, ముంబైలో కాపురం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నవ దంపతులను విష్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

మూడేళ్ల వయసు నుంచే...

మూడేళ్ల వయసు నుంచే...

మూడేళ్ల వయసులోనే టీవీ యాడ్స్‌లో నటించిన ఆర్తి చాబ్రియా... దాదాపు 300లకుపైగా కమర్షియల్స్‌‌లో నటించింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2000 పజెంట్ విజేతగా నిలిచింది. పలు మ్యూజిక్ వీడియోలు చేసింది. 2001లో ‘ఫియర్ ఫ్యాక్టర్-ఖత్రోంకి ఖిలాడి' 4వ సీజన్ విజేతగా నిలిచింది. 2001లో ఆమె నటించిన తొలి చిత్రం ‘లజ్జ' విడుదలైంది.

అప్పటి నుంచి సినిమాలకు దూరం

అప్పటి నుంచి సినిమాలకు దూరం

కెరీర్లో దాదాపు 25 సినిమాలు చేసిన ఆమె హిందీతో పాటు, తెలుగు, కన్నడలో నటించారు. ‘ఒకరికి ఒకరు' సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు. ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి-గొడమీద పిల్లి చిత్రాల్లో నటించారు. చింతకాయల రవిలో ఐటం సాంగ్ చేశారు. 2013లో ఓ పంజాబీ చిత్రంలో నటించిన ఆమె ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X