42 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో అభిరామి.. కమల్ హాసన్‌తో లిప్‌లాక్‌తో మరింత నాటుగా!
మణిరత్నం దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం థగ్‌లైఫ్. దాదాపు 35 ఏళ్ల తర్వాత మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామిలు కమల్ సరసన ఆడిపాడనున్నారు. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
వివాదాల్లో థగ్‌లైఫ్
ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో కమల్ హాసన్, మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్‌లు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. థగ్ లైఫ్ సినిమా ఏమో కానీ ఈ చిత్రం వివాదాల్లో కూరుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్‌లో కమల్ హాసన్, అభిరామి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

లిప్‌లాక్ వివాదంపై స్పందించిన అభిరామి
70 ఏళ్ల వయసులో కూతురు వయసున్నీ హీరోయిన్లతో ఇలాంటి సీన్స్ కమల్ హాసన్ స్థాయికి అవసరమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే కమల్ - అభిరామిల మధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఇప్పుడే కొత్త కాదు గతంలో పోతురాజు అనే సినిమాలోనూ అభిరామితో కమల్ లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. థగ్‌లైఫ్‌లో లిప్‌లాక్ వివాదంపై మణిరత్నం ఘాటుగా బదులిచ్చారు. సినిమాలో ఆ సీన్ ఏ సందర్భంలో వచ్చిందో చూశాక మాట్లాడాలని.. అలాగే స్క్రీన్‌పై పాత్రలనే చూడాలి తప్పించి నటీనటులను కాదని చురకలంటించారు. అభిరామి కూడా 3 సెకన్ల లిప్‌లాక్ కోసం ఇంత సీన్ ఎందుకు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినిమా చూసిన తర్వాత ఎవరూ ఆ కామెంట్స్ చేయరని వ్యాఖ్యానించారు.
బాలనటిగా ఎంట్రీ
ఇక కేరళకు చెందిన అభిరామి అసలు పేరు దివ్య గోపికుమార్. 1995లో కథపురుషన్ అనే మలయాళ సినిమాలో బాలనటిగా కనిపించిన అభిరామి తర్వాత హీరోయిన్‌గా మారారు. తెలుగులో థ్యాంక్యూ సుబ్బారావు, ఛార్మినార్, చెప్పవే చిరుగాలి సినిమాలలో నటించారు. 2004లో అభిరామికి అమెరికాలో ఉద్యోగం రావడంతో వీరి కుటుంబం అక్కడే స్థిరపడింది. ఈ దశలో 2009లో రాహుల్ పవనన్‌తో ఆమె వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా అభిరామి 2014లో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి తన వయసు, ఇమేజ్, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కథాబలమున్న చిత్రాలనే చేస్తూ వస్తున్నారు అభిరామి.
ఫోటోషూట్‌లతో హల్‌చల్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే అభిరామి తన సినిమాలు, షోలు, ఇతర కార్యక్రమాలు, వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అభిమానులతో పంచుకుంటారు. ఇక 42 ఏళ్ల వయసులోనూ శారీ, ఇతర మోడ్రన్ ఔట్‌ఫిట్స్‌లో హాట్ హాట్ ఫోటో షూట్, వీడియోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. తాజాగా సల్వార్ కమీజ్, లెహంగాలలో చేసిన ఫోటో షూట్‌ను అభిరామి ఇన్‌స్టాలో షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం అభిరామి అందాలను మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











