అనసూయకు వేధింపులు.. యువకుడి అరెస్ట్

సోషల్ మీడియా ఇన్ల్పూయెన్స్ పెరిగిన తర్వాత వ్యక్తిగత జీవితాలు అత్యంత అభద్రతాభావానికి గురి అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలకు, సినీ తారలు, రాజకీయ నేతల పరిస్థితిని మాటల్లో చెప్పలేం. సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఆధారంగా చేసుకొని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, వారి ప్రైవసీని దెబ్బ తీయడం, వారి పర్సనల్ లైఫ్‌లో ఉండే స్వేచ్ఛపై దాడి చేయడం లాంటి అంశాలను చూస్తూనే ఉంటాం. అయితే అనసూయ ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియాలో దాడి చేయడం గమనిస్తూనే ఉన్నాం. ఆమె పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేయడం అత్యంత వివాదంగా మారిన విషయం తెలిసిందే. తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వేధిస్తున్నారంటూ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేసి ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ తనపై పోస్టులు పెడుతున్నారు. అలాగే తన ఫోటోలను మార్పింగ్ చేసి పోస్టు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా అసభ్యంగా వీడియోలు చేస్తూ తన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల అనసూయ ఫిర్యాదు చేశారు. కొన్ని పోస్టుల లింకులను, ఫోటోలను వారికి సమర్పించారు. దాంతో దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన అల్వాల గ్రామ నివాసి దోరెపల్లి చంటి అనే యువకుడిని అరెస్ట్ చేశారు.

Anasuya Bhardwaj

చంటి అనే యువకుడు 2025 నుంచి సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో అశ్లీల, అసభ్యత కూడిన పోస్టులు పెట్టాడు. అభ్యంతరకమైన భాషను ఉపయోగిస్తూ ద్వేషించాడు అని అనసూయ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో చంటిని అరెస్ట్ చేసి విచారించారు. తాను చేసిన చర్యలకు బాధ్యుడిని చేస్తూ కేసు నమోదు చేశారు. చంటిపై బీఎన్ఎస్ యాక్ట్, సెక్షన్ 75, 79, 336 (4), 351, 356 తోపాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఈ, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

గత కొద్దికాలంగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ధారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. విజయ్ దేవరకొండతో వివాదంలోను, అలాగే శివాజీతో కాంట్రవర్సీ లాంటి సంఘటనల సమయంలో ఆమెను కొందరు నెటిజన్లు, హీరోల ఫ్యాన్స్ ఘాటుగా ట్రోలింగ్ చేయడం తెలిసిందే. ఆమె వారికి ధీటుగా సమాధానాలు ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో తనపై ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత స్వేచ్చను హరిస్తుండటంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Read more about: anasuya bhardwaj tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X