ఫస్ట్ కిస్ మొగుడికేనంటూ కబుర్లు .. దొరికిపోయిన శ్రీలీల, ఆ హీరోకి ముద్దుపెట్టిన ఫోటోలు వైరల్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిండా పాతికేళ్లు కూడా లేకుండానే ఈ ముద్దుగుమ్మ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో దూసుకెళ్తోంది. నందమూరి బాలకృష్ణ, మహేశ్ బాబు , అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశాన్ని చాలా త్వరగానే సంపాదించిన శ్రీలీల.. ప్రస్తుతం కిస్సిక్ సాంగ్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు.

ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తే ఫలితం తేడా కొడుతుందని శ్రీలీల త్వరగానే గ్హించారు. ఈ ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ వంటి సినిమాలు చేసినా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్, తమిళ్‌లో అజిత్‌తో గుడ్ బాడ్ అగ్లీలో నటిస్తోంది. అందాల అరబోత కన్నా కథ, సినిమాలో తన క్యారెక్టర్‌కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని శ్రీలీల తేల్చి చెబుతున్నారు. కానీ అలాంటి కథలు ఆమె దగ్గరికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సంపాదించిన అనుభవంతో ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది.

acrtress sreeleela trolled by netizens over she comments on first lip kiss

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని తీరా ఇక్కడ ప్లాపులు రాగానే ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మాటను నిజం చేస్తూ శ్రీలీల కూడా తమిళ్‌పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లోనూ ఆమె ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన నటిస్తున్న మూవీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో చేసిన కిస్సిక్ ఐటెం సాంగ్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

డ్యాన్స్‌కి ఐకాన్ లాంటి అల్లు అర్జున్‌తో డ్యాన్స్ బాగా చేసే శ్రీలీల జత కట్టడంతోనే ఈ సాంగ్‌కు భారీ హైప్ వచ్చింది. అందుకు తగినట్లుగానే తన మెస్మరైజింగ్ లుక్స్‌తో అందరినీ కట్టిపడేస్తున్నారు శ్రీలీల. ఇక గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్‌పై గాసిప్స్ సహజం.. అందులోనూ ఫామ్‌లో ఉన్న వారిపై ఇవి కాస్త ఎక్కువ. దానికి తగినట్లుగా శ్రీలీల ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ పలుమార్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి.

acrtress sreeleela trolled by netizens over she comments on first lip kiss

ఈ పుకార్లపై తక్షణం స్పందించిన శ్రీలీల.. అవన్నీ నిరాధారమని, ప్రస్తుతం తన దృష్టి సినిమాలు, కెరీర్‌పైనే ఉందని క్లారిటీ ఇచ్చింది. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలని భావిస్తున్నానని, డాక్టర్ కావాలనేది తన డ్రీమ్ అని ఆమె పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. షూటింగ్స్‌లో ఉన్నా పరీక్షలు ఉంటే రాత్రివేళల్లో చదువుకుంటానని చెప్పి అందరి నోళ్లు మూయించింది శ్రీలీల. అయితే గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది కూడా తన పెళ్లి , వైవాహిక జీవితం గురించి కావడంతో చర్చనీయాంశమైంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ లిప్ లాక్ గురించి మాట్లాడింది. నేను ఏ హీరోతో లిప్ లాక్ సీన్‌లో నటించనని.. నా ఫస్ట్ కిస్ నా భర్తకే ఇస్తానని చెప్పింది శ్రీలీల. అయితే ఇక్కడే ఈ బ్యూటీ దొరికిపోయింది. కారణం ఆమె గతంలోనే లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే. 2019లో కిస్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా.. అది తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ పేరిట రిలీజైంది. ఇందులో ఓ సీన్‌లో హీరోకి ఘాటుగా లిప్ లాక్ ఇస్తుంది శ్రీలీల. తను గతంలో ఇలాంటి సీన్ చేశానన్న విషయం కూడా గుర్తు లేని ఆమె.. అబద్ధం చెప్పడంతో నెటిజన్లు శ్రీలీలను ఆడుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: sreeleela movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X