కాజల్ అగర్వాల్ సూపర్ హాట్ షో.. తల్లయ్యాకా కూడా తగ్గని ఎక్స్ పోజింగ్!

సౌత్ సినీ ఇండస్ట్రీరో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. నందమూరి కల్యాణ్ రామ్ తో తొలిసారిగా జత కట్టి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందం అనతి కాలంలో అగ్ర కథానాయికగా ఎదిగిపోయింది. సినీ కెరీర్ బాగా సాగుతున్న క్రమంలోనే వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మిగతా హీరోయిన్ల లాగానే ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అదరగొడుతోంది. తల్లిగా మారిన కూడా తన అందం ఏం చెక్కుచెదరలేని చెప్పకనే చెబుతోంది.

ఎంతో ప్రభావం..

ఎంతో ప్రభావం..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస సినిమాలతో చాలా కాలం పాటు స్టార్లుగా హవా చాటారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో టాలీవుడ్‌లో ఎంతో ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిడమే కాకుండా.. అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటోంది.

టాక్ పరంగా ఎలా ఉన్నా..

టాక్ పరంగా ఎలా ఉన్నా..

హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే గ్లామరస్ బ్యూటి కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో అలరించింది. మోడలింగ్ లో సత్తా చాటుతున్న సమయంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా తెరగేంట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నా కాజల్ అగర్వాల్ అందానికి తెలుగు చిత్రసీమే ఫిదా అయిపోయింది. దీంతో మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ భామ.

బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు..

బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు..

లక్ష్మీ కల్యాణం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని తన సత్తా చాటింది ఈ కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అనంతరం మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా తన గ్లామర్ ను ఒలకబోసింది.

ఇతర భాషల్లో..

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా చాలా కాలం పాటు టాలీవుడ్ లో సత్తా చాటింది. కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలతోనే కాకుండా వయసులో ఆమె కన్న తక్కువ ఉన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. అలాగే కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ వంటి పలు భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుంది.

రెండేళ్లకు.. తప్పుకోవడం..

ఇక తన సినీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమలో విహరించిన తర్వాత, సినీ కెరీర్ కాస్తా డల్ గా సాగుతుందన్న క్రమమంలో గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది కాజల్ అగర్వాల్. ప్రియుడిని పెళ్లాడిన రెండేళ్ల తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్', ఆచార్య వంటి సహా పలు చిత్రాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

బాలకృష్ణతో జోడీ..

ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ బాబుకి 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఆ మధ్య కొడుకు నీల్, భర్త గౌతమ్ తో కుటుంబ బంధాన్ని ఎంజాయ్ చేసింది. ఇక ఇటీవలే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది ఈ సుందరి. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఘోస్టీ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ఇండియన్ 2 సినిమాతోపాటు బాలకృష్ణ సరసన ఓ సినిమా చేస్తున్నట్లు టాక్.

అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..

సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎంతోకాలంగా సందడి చేస్తోంది బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్. అప్పుడప్పుడు హాట్ పిక్స్ వదలుతూ తన హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని చెబుతోంది. తాజాగా వదిలిన ఫొటోల్లో ఎద, నడుము అందాలను ఆరబోసింది. ఇక మరొక ఫొటోల్లో మోకాలి పైవరకు ఉన్న బుల్లి పూల గౌను ధరించిన కాజూ తన థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. భర్త గౌతమ్ తో కలిసి రొమాంటిక్ పోజులు ఇచ్చింది. ఈ పిక్స్ వైరల్ కాగా తల్లయిన కూడా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X