శ్రీదేవి, సావిత్రిల చావులకు లింక్.. వారిద్దరి మృతికి కారణం అదే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
అలనాటి అందాల తార శ్రీదేవి గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను కల్గిన ఈమె అదిరిపోయే చిత్రాలు చేస్తూ.. అందరినీ ఉర్రూతలూగించింది. ఆమె అందాలకు కోట్లాది మంది అభిమానులు ఉండగా.. మరెంతో మంది ఆమెను భార్యగా పొందాలనుకున్నారు. కానీ ఆమె మాత్రం తన మనసుకు నచ్చిన బోనీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈమె దుబాయ్ లో అకాల మరణం చెందింది. ఆమె చావు సహజ మరణం కాదని.. ఏదో జరిగిందని చాలా మంది ఊహాగానాలు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మత్తులో ఉన్న ఆమె బాత్ టబ్ లో పడి చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. భర్త ఆమెతో పాటే లేకపోవడంతో అతడే చంపి ఉంటాడని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. కానీ ఆమెది సహజ మరణమేనని నీళ్లు మింగే ఆమె చనిపోయిందని.. వైద్యులు నిర్దారించారు. ఇలా ఆ వార్తలకు చెక్ పడగా.. మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా శ్రీదేవి భర్త బోని కపూర్ ఆమె బయోపిక్ రానివ్వనని చెప్పగా... అంతా అతడే హత్య చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ తాజాగా ఓ సీనియర్ నటుడు, రైటర్ శ్రీదేవి మృతికి గల కారణాల గురించి వివరించారు. ఆమె ఎలా చనిపోయిందో కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ సీనియర్ రచయిత, నటుడు అయిన తోటపల్లి మధు.. ఎన్నెన్నో సినిమాలకు కథలు రాశారు. అలాగే అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా చాలా ఏళ్లుగా సినీ రంగంలోనే ఉంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈయన తాజాగా శ్రీదేవి మృతిపై స్పందించారు. శ్రీదేవికి అందం అంటే చాలా ఇష్టం అని.. దానికోసమే అన్నం కూడా ఎక్కువగా తినకపోయేదని వివరించారు. అలాగే గతంలో విపరీతమైన బిజీగా ఉన్న ఈమెకు అవకాశాలు తగ్గడం, ఖర్చులు పెరగడం.. అలాగే కూతుర్లకు కూడా తనలాగే ఫ్యూచర్ ఉంటుందని భావించగా.. అదేమీ లేకపోవడంతో శ్రీదేవి బాధలో కూరుకుపోయిందని చెప్పాడు.
ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ తెగ బాధ పడిపోతూ ఉండేదని.. అలాగే శ్రీదేవితో పాటు తన ఇద్దరు కూతుళ్ల కోసం ప్రతిరోజూ లక్ష రూపాయలు ఖర్చు అయ్యేవని చెప్పుకొచ్చాడు. ఈక్రమంలోనే శ్రీదేవి మద్యానికి బానిస అయిందని.. ప్రతీరోజూ తాగేదని వివరించారు. ఆమె తాగని రోజు ఉండదని స్పష్టం చేశారు. ఇలా దుబాయ్ వెళ్లినప్పుడే శ్రీదేవి ఒంటరిగా ఉందని.. ముఖ్యంగా భర్త పని మీద బయటకు వెళ్లడం, పక్కన కూతురు కూడా లేకపోవడంతో.. ఆమె తాగుతూ, తన కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుందని అన్నారు. అయితే తాను రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉండగా.. బోనీ కపూర్ ఫోన్ చేసి ఆ విషయాన్ని ఆమెకు చెప్పేవారట.
కానీ ఆరోజు ఫోన్ చేస్తే మాత్రం ఆమె స్విచ్ఛాఫ్ అవడంతో కలవలేదని, దీంతో ఆయన తిరిగి ఇంటికి వచ్చారని అన్నారు. కానీ అప్పటికీ ఎక్కువ తాగేసిన ఆమె, భర్తను చూసి సంతోషంలో మరింత తాగిందని అన్నాడు. స్నానం చేసి కిందకు వెళ్లి ఏదైనా తినాలనుకోగా.. బాత్రూంలోకి వెళ్లిన ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని... అలా చనిపోయిందని రైటర్ తోటపల్లి మధు వివరించారు. కేవలం శ్రీదేవి మాత్రమే కాదని.. మహానటి సావిత్రి కూడా ఇలా మద్యానికి బానిసయ్యే కోమాలోకి వెళ్లిందని.. తాగుడుకు బానిసలై చాలా మందే చనిపోయారని వివరించారు.


Click it and Unblock the Notifications











