అనసూయ నిజ స్వరూపం బయటపెట్టిన నటుడు.. ఎవరూ ఊహించని విధంగా ఆమె పేరు!
యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన ఈ భామ సినిమాల్లో కూడా రాణిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ లేదా ఫోటో షూట్ లో అప్లోడ్ చేస్తూ ఈ భామ వార్తల్లో ఉండే ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు నటుడు జీవన్. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్టీఆర్ సినిమాతో
ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ నాగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళలేదు. ఇక చదువు తరువాత సాక్షిలో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక జబర్దస్త్ ద్వారా అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే తన అందంతో ఆమె కుర్రాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటుంది.

టీవీ క్రేజ్ తో
ఇక అనసూయకు ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే వచ్చిన అన్ని పాత్రలు చేయకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఈ భామ చేస్తూ ఉంటుంది. ఇక ఆమె రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది.

చాలా సేవాతత్పరురాలు
ఇక ఆ దెబ్బకు అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే నిజానికి అనసూయ ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకుంటూ, వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎక్కువగా ఆమె బట్టల గురించి అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె చాలా సేవాతత్పరురాలు అని తనకు చాలా అండగా నిలబడింది అని కరోనా కాలంలో చాలా మందికి సహాయం చేసిన నటుడు జీవన్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనసూయ పెద్ద సపోర్ట్
కరోనా కాలంలో సినిమా ఇండస్ట్రీ వారే కాదు ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ నటుడు జీవన్ కుమార్ అండగా నిలబడ్డారు. తనకు సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి ఆశీస్సులు ఉన్నాయని సాయి ధరమ్ తేజ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, విశ్వక్సేన్ వంటి వాళ్ళు తనకు చాలా అండగా నిలబడ్డారు అని చెబుతూనే అనసూయ కూడా తనకు చాలా పెద్ద సపోర్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఏ విధంగా సపోర్ట్ చేశారు ?
అయితే ఏ విధంగా సపోర్ట్ చేశారు ? ఏమిటి అనే విషయాలు చెప్పకపోయినా తన సేవల వెనుక అనసూయ ఉందని మాత్రం చెప్పుకొచ్చారు. దీంతో అనసూయ డ్రెస్సింగ్ గురించి ఇతర ఇతర విషయాల గురించి కామెంట్ చేసే వాళ్ళు ఆమె చేస్తున్న సేవ గురించి కూడా కామెంట్ చేయాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇక ప్రస్తుతం అనూసుయ పుష్ప సినిమాలో సునీల్ భార్యగా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











