twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతడిలా మానసిక వైద్యుడి వద్దకు వెళ్ల లేదు.. సీత ఫ్లాప్‌పై కాజల్ అగర్వాల్

    |

    గత పదేళ్లుకు పైగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొంటున్నారు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలతోపాటు, కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇష్టపడి చేసిన సీత చిత్రం నిరాశ పరిచింది. ఆ పరాజయ భారం నుంచి బయటపడి.. ఇప్పుడు రణరంగం చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినితో కలిసి రణరంగంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. కాజల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

    సీత నిరాశతో

    సీత నిరాశతో

    సీత మూవీ నన్ను నిరాశ పరిచింది. అయితే నా వంతు బాధ్యతను పూర్తిగా నెరవేర్చానని అనుకొంటాను. నిజాయితీగా పనిచేయడమే నా వంతు. అది హిట్టా ఫ్లాఫా అనేది మన చేతిలో ఉండదు. విజయం అనేది టీమ్ వర్క్. సీత విషయంలో నా జడ్జిమెంట్ కరెక్ట్. నా రోల్‌కు మంచి ప్రశంసలు లభించాయి. సీత సక్సెస్ సాధించనప్పటికీ నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది అని కాజల్ పేర్కొన్నది.

    నా కెరీర్‌లోనే సీత బెస్ట్

    నా కెరీర్‌లోనే సీత బెస్ట్

    ఇప్పటికీ సీత నా కెరీర్‌లో మంచి చిత్రంగా భావిస్తాను. మళ్లీ తేజ డైరెక్షన్‌లో నటించాలని అనుకొంటున్నాను. ఇంకా తేజ సార్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. సీత పరాజయం ద్వారా ఎంతో కొంత నేర్చుకొన్నాను. ప్రతీ సినిమా ఓ అనుభవాన్ని నేర్పుతుంది. ఆ సినిమాకు నేను ఎంత ఉపయోగపడ్డానో అనేది నేను బేరీజు వేసుకొంటాను అని కాజల్ అగర్వాల్ వెల్లడించింది.

    ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి

    ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి

    సీత సినిమాలో నా పాత్ర నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది. చాలాకాలం ఆ పాత్ర నన్ను వెంటాడింది. కొన్నిసార్లు నేను నా చుట్టు ఉన్న వాళ్లతో చికాకు పడుతుంటాను. ఇలాంటి సమస్యల నుంచి మెడిటేషన్ ద్వారా బయటపడుతాను. పద్మావత్ సినిమాలో ఖిల్జీ పాత్ర నుంచి బయటపడలేక మానసిక వైద్యుడిని సంప్రదించారని విన్నాను. సీత విషయంలో నాకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు అని కాజల్ వివరించారు.

    నిర్మాణ రంగంలోకి వెళ్తాను

    నిర్మాణ రంగంలోకి వెళ్తాను

    దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ఓ సినిమాను నిర్మిస్తున్నారనే వార్త నిజం కాదు. కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నాను. చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడే నిర్మాణ రంగంలోకి ప్రవేశించలేను. ఎందుకంటే నవంబర్‌ తర్వాతే సినీ నిర్మాణం గురించి ఆలోచిస్తాను. ప్రశాంత్ వర్మ తెరకెక్కించే సినిమా కథ అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పగలను అని కాజల్ తన భవిష్యత్ కార్యచరణను తెలిపారు.

    English summary
    Ranarangam is a 2019 Telugu crime action thriller film written and directed by Sudheer Varma. Produced by Suryadevara Naga Vamsi under his banner Sithara Entertainments. Sharwanand, Kajal Aggarwal and Kalyani Priyadarshan are in the lead roles.The film is scheduled for release on 15 August 2019. In this occassion, Kajal Spoke to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X