For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిలక్ష్మే కాదు. కాజల్ కూడా చీరకట్టింది.. అందంతో అదరగొడుతున్న సీత

|

అందాల భామ కాజల్ అగర్వాల్ మోడ్రన్‌గానే కాదు చీరకట్టులో కూడా అదరగొట్టేస్తున్నది. తాజాగా సంప్రదాయంగా చీర కట్టుకొని ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అయితే ఈ ఫోటోషూట్‌ ఓ ఫ్యాషన్ కంపెనీకి సంబంధించినట్టు సమాచారం. కానీ బ్రాండ్ పేరు మాత్రం గోప్యంగా ఉంచడం గమనార్హం.

ఇప్పటి వరకు మోడ్రన్, ఫ్యాన్సీ డ్రస్సెస్‌లో కనిపించిన కాజల్‌.. ఒక్కసారిగా చీరలో కనిపించి అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. చీరకట్టులో రాజసంగా కనిపించడమే కాకుండా మరింత అందంగా కనిపించింది. ఆమెను చీరకట్టులో చూసిన వారందరూ ఆమె అందం గురించి తెగ కామెంట్లు పెడుతున్నారు.

Actor Kajal aggarwal look gorgeous in Saree

ఇటీవల తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సీత చిత్రంలో కనిపించింది. అయితే బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక తమిళంలో రూపొందిన క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్‌ మూవీలోనూ, తమిళ చిత్రం కోమలిలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్‌లోనే రిలీజ్ కానున్నది. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలు పెట్టుకొన్నది.

Actor Kajal aggarwal look gorgeous in Saree

అంతేకాకుండా హీరో మంచు విష్ణు నిర్మాతగా మారి రూపొందిస్తున్న హాలీవుడ్ సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసింది. దీంతో దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల తర్వాత ఆంగ్ల సినీ పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నది.

English summary
Actor Kajal Aggarwal participated in Photo shoot for a commercial brand. Actress looks very beautyful and enthrall the fans. Her movies Paris Paris, Komali yet to release.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more