Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జ్యోతిలక్ష్మే కాదు. కాజల్ కూడా చీరకట్టింది.. అందంతో అదరగొడుతున్న సీత
అందాల భామ కాజల్ అగర్వాల్ మోడ్రన్‌గానే కాదు చీరకట్టులో కూడా అదరగొట్టేస్తున్నది. తాజాగా సంప్రదాయంగా చీర కట్టుకొని ఫొటోషూట్‌లో పాల్గొన్నది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అయితే ఈ ఫోటోషూట్ ఓ ఫ్యాషన్ కంపెనీకి సంబంధించినట్టు సమాచారం. కానీ బ్రాండ్ పేరు మాత్రం గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఇప్పటి వరకు మోడ్రన్, ఫ్యాన్సీ డ్రస్సెస్లో కనిపించిన కాజల్.. ఒక్కసారిగా చీరలో కనిపించి అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. చీరకట్టులో రాజసంగా కనిపించడమే కాకుండా మరింత అందంగా కనిపించింది. ఆమెను చీరకట్టులో చూసిన వారందరూ ఆమె అందం గురించి తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సీత చిత్రంలో కనిపించింది. అయితే బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక తమిళంలో రూపొందిన క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ మూవీలోనూ, తమిళ చిత్రం కోమలిలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్‌లోనే రిలీజ్ కానున్నది. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలు పెట్టుకొన్నది.
అంతేకాకుండా హీరో మంచు విష్ణు నిర్మాతగా మారి రూపొందిస్తున్న హాలీవుడ్ సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసింది. దీంతో దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల తర్వాత ఆంగ్ల సినీ పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నది.