నా ప్రతిభ, పరిణతిని రణరంగంలో చూస్తారు.. కల్యాణి ప్రియదర్శన్
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కల్యాణి చెప్పారు. ఆమె ఏమన్నారంటే..
హలో సినిమా నన్ను నిరాశపరిచింది. చిత్రలహరి నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. గత రెండు సినిమాల్లో కంటే రణరంగం సినిమాలో నా పాత్ర చాలా పరిణితితో కూడినది. ఓ రకంగా నా పాత్రను అద్భుతంగా పోషించాననే నమ్మకం కలిగింది. తప్పకుండా గీత పాత్రలో మెచ్యురిటీతో కూడిన ఫెర్ఫార్మెన్స్‌ను చూస్తారు.

నా కెరీర్ జోరు అంతగా కనిపించడం లేదనేది నిజమే. నేను చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకొంటున్నాను. నాకు ఏదైనా షూట్‌కు వెళ్లాలంటే ఎదో ఎక్సైటింగ్‌గా ఉండాలి. నా పాత్ర కూడా ఎక్సైటింగ్ ఉంటేనే నేను చేయాలని నిర్ణయించుకొన్నాను. నటన పరంగా నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఫెర్ఫార్మర్‌గా భాష కూడా నేర్చుకోవాలి. త్వరలోనే తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను.
నా సినిమాల కథలను నేనే ఎంచుకొంటాను. మరొకరి సహాయం తీసుకొను. అవసరమైతే నా ఫాదర్ (దర్శకుడు ప్రియదర్శన్), మదర్ (లిజి)ని అడుగుతాను. వారి నుంచి సలహాలు అడిగితే ఒకటే మాట చెప్పారు. నీవు ఎవరి వద్ద సలహాలు, సూచనలు తీసుకోను. వాటి వల్ల నీ ఆలోచన విధానం మారుతుంది. నీకు నచ్చింది నీవు చేయి. నీకు బలంగా మారుతుంది. ఇండస్ట్రీలో నీ గురించి పది మంది మంచిగా మాట్లాడితే.. ఎనిమిది మంది చెడుగా మాట్లాడుతారు. అందుకే సలహాలు తీసుకోకు అని నా తల్లిదండ్రులు చెబుతారు.


Click it and Unblock the Notifications











