మళ్లీ యువ హీరోను పట్టేసిన కీర్తీ సురేష్.. ఆయనతో రెండోసారి!
భీష్మ మూవీతో భారీ సక్సెస్‌ను అందుకొన్న యువ హీరో నితిన్ సినిమాల వేగం పెంచారు. భీష్మ తర్వాత వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తూనే మరో సినిమాపై కసరత్తు చేస్తున్నారు. రంగ్ దే తర్వాత అంధాధూన్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమా గురించి ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అంధాదూన్ రీమేక్‌లో కీర్తీ సురేష్ నటిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కీర్తీ సురేష్‌తో పాటు ప్రియాంక అరుల్ మోహన్‌ను కూడా పరిగణనలోకి తీసుకొన్నప్పటికీ.. కీర్తీ సురేష్‌కే ఓటేశారనే వార్త వినిపిస్తున్నది.

హీరోయిన్ ఎంపికలో ప్రియాంక అరుల్ కంటే కీర్తీ సురేష్ ఎక్కువ టాలెంట్ అని, తెలుగులో ఆమెకు ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనే అంశాలను దృష్టిలోపెట్టుకొన్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో రాధికా ఆప్టే, టబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ అంధ పియానిస్టుగా కనిపించబోతున్నారు.
అయితే కీర్తీ సురేష్ విషయానికి వస్తే.. నితిన్‌తో కలిసి రంగ్ దే సినిమాలో నటిస్తున్నారు. ఇక వరుసగా మరోసారి నితిన్‌తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











