యాక్టర్ కుష్బూ ఫ్యామిలీలో కరోనా విషాదం.. చివరిచూపుకు దూరంగా నటి

కరోనావైరస్ విచ్చలవిడిగా వెంటాడుతుండటంతో సినీ ప్రముఖులకు విషాదాన్ని మిగిలుస్తున్నాయి. సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు కొవిడ్ 19 కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల కాకుండా వేలాది మంది కరోనాకు బలి అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి కుష్బూ కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. వివారాల్లోకి వెళితే..

కుష్బూ ఇంట్లో విషాదం

కుష్బూ ఇంట్లో విషాదం

నటి, రాజకీయ వేత్త కుష్బూ ఇంట్లో విషాదం నెలకొనడంతో ఒక్కసారిగా సన్నిహితులు ఉలిక్కిపడ్డారు. ముంబైలో కుష్బూ వదిన కొవిడ్ 19 కారణంగా మరణించారు. దాంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. తన ఇంట్లో చోటుచేసుకొన్న విషాదం గురించి కుష్బూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నా వదిన ప్రాణాంతక వ్యాధితో

నా వదిన ప్రాణాంతక వ్యాధితో

తన వదిన మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కుష్బూ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కారణంగా నా వదిన మరణించారు. మా కుటుంబానికి దూరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరం. మా వదిన లేని లోటు తీరని బాధను కలిగిస్తున్నది అని కుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 అంత్యక్రియలకు కుష్బూ దూరం

అంత్యక్రియలకు కుష్బూ దూరం

కొవిడ్ 19 నిబంధనలు, ఆంక్షల కారణంగా కుష్బూ తన వదిన అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. చెన్నై నుంచి ముంబై వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో చివరిచూపు చూసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. ముంబై, తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తున్న తీరు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది.

కుష్బూకు కోలీవుడ్ ప్రముఖుల సంతాపం

కుష్బూకు కోలీవుడ్ ప్రముఖుల సంతాపం

ఇక కుష్బూ ఇంట్లో చోటుచేసుకొన్న విషాదంపై కోలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ప్రముఖ కోరియోగ్రాఫర్ బృంద, బిగ్‌బాస్ సెలబ్రిటీ కాజల్ పసుపతి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యాన్ని కూడగట్టుకోవాలి అని పలువురు తమ సంతాపం ప్రకటనలో పేర్కొన్నారు.

Recommended Video

Raashi Khanna Speech At Worlds Famous Lover Event
కుష్బూ కెరీర్ గురించి

కుష్బూ కెరీర్ గురించి

ఇక కుష్బూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలకు వస్తే.. ప్రస్తుతం రాజకీయాలను, సినీ రంగంలో యాక్టింగ్‌తోనూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటిస్తున్నారు. దర్శకుడు సిరుతాయ్ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న రజనీకాంత్ 168వ చిత్రంలో కుష్బూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మీనా కూడా నటించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X