పెళ్లి తరువాత రూటు మార్చిన నమిత.. 10 కేజీలు బరువు తగ్గి, పవర్ ఫుల్ లుక్!
బొద్దు అందంతో ఆకట్టుకునే నమిత పెళ్లి తరువాత రూటు మార్చింది. నమిత గత ఏడాది వీరేంద్ర చౌదరిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నమిత ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం నమిత అహంభావం అనే ద్విభాషా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఎప్పుడూ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకునే నమిత ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. నమిత లుక్స్ పవర్ ఫుల్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఎలాంటి గ్లామర్ అంశాలకు తావులేదు. కేవలం నమిత నటన, కథపైనే ఈ చిత్రం ఆధాపడి ఉంటుంది. ఈ చిత్రం కోసం నమిత 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

మహిళా సాధికారత నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీమహేష్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











