జోష్‌లో నయనతార డేటింగ్.. ప్రియుడితో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా?
దక్షిణాది అందాల తార నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ డేటింగ్ వ్యవహారం జోష్‌గా కొనసాగుతూనే ఉంది. తాజా ఈ ప్రేమపక్షులు కలిసి వెళ్లి కంచీపురంలోని అతి వరదార్ ఆలయాన్ని దర్శించుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కంచీపురంలోని అతి వారదార్ స్వామి విగ్రహాన్ని 45 ఏళ్లకు ఒకసారి అండర్ వాటర్ నుంచి బయటకు తీస్తారు. సుమారు 45 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా భక్తులు కంచీపురం ఆలయానికి పోటెత్తుతారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ ఆలయం కిక్కిరిసి ఉంటుంది.

ఇలాంటి ప్రత్యేకతలున్న ఆలయాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ దర్శించుకొన్నారు. ఆలయాన్ని సందర్శించుకొన్న ఫోటోను నయనతార సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
నయనతార కెరీర్ విషయానికి వస్తే, తెలుగు, తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి సరసన సైరా నర్సింహారెడ్డి, రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో నటించారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ విజయ్ చిత్రం బిగిల్‌లో కూడా నటిస్తున్నారు.

ఇక విఘ్నేష్ విషయానికి వస్తే, శివకార్తీకేయన్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి స్క్రిప్టు వర్క్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











