Amaran Success Meet: సాయిపల్లవితో నాకు ఆ భయం.. అలా తినేస్తుందంటూ నితిన్

Amaran Success Meet: అమేజింగ్ , టాలెంటెడ్ యాక్టరస్ సాయి పల్లవి. హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోత అనే స్థాయి నుండి అంతకుమించి అనేలా ఔచిత్యాన్ని తీసుకువచ్చిన నటి సాయి పల్లవి. తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ప్రతి పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటుంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. అందాల ఆరబోత లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాల్లో నటిస్తూ.. అందరినీ మెప్పిస్తోంది. తాజాగా హీరోయిన్ సాయి పల్లవిపై టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన అమరన్ మూవీ సూపర్ సక్సెస్​ అందుకున్నారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కింది. ఈ మూవీలో హీరో శివ కార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్రలో నటించగా.. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి కనిపించారు. ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా.. ఆర్‌.మహేంద్రన్‌, వివేక్‌ కృష్ణన్ తో కలిసి సీనియర్ నటుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌ సంయుక్తంగా నిర్మించారు.

Actor Nitin made interesting comments on Actress Sai Pallavi in Amaran movie success meet

దీపావళి కానుకగా విడుదలైన అమరన్ మూవీ హిట్ టాక్ తో దూసుకవెళ్లింది. ఈ మూవీ ఆరు రోజుల్లోనే దాదాపు రూ.155 కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది.అమరన్ మూవీ హిట్ టాక్ దూసుకెళ్లడంతో పాటు కలెక్షన్లలోనూ అదరగొడుతోంది. దీంతో మూవీ టీం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో ఛీప్ గెస్ట్ గా పాల్గొన్నారు హీరో నితిన్. ఈ సక్సెస్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ..' దీపావళికి విడుదలైన మూడు సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. అందులో అమరన్ మూవీని తమిళ్ డబ్బింగ్ మూవీలా కాకుండా.. టాలీవుడ్ ఆడియన్స్ స్ట్రైయిట్ తెలుగు మూవీలా చూసి అమరన్ మూవీని భారీ సక్సెస్ చేశారు.' అంటూ మూవీ టీం కు అభినందనలు తెలిపారు.

ఇదెలా ఉంటే.. అమరన్ మూవీ తెలుగు రైట్స్ ను హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తీసుకున్న విషయం తెలిసిందే. మూవీ రైట్స్ కొన్నప్పుడూ .. ' ఈ మూవీ ఎందుకు తీసుకున్నావ్ నాన్న.. అది తమిళ్ డబ్బింగ్ మూవీ కాదా' అని తాను ప్రశ్నించగా.. తన తండ్రి ఒకటే సమాధానం చెప్తారని.. 'కమల్ హాసన్, సాయి పల్లవి మీద నమ్మకంతోనే అమరన్ సినిమాను కొన్నా'నని తెలిపారు. 'మా నాన్న నమ్మకం నిజమైంది. నా గెస్ట్ కరెక్ట్ కాదని అనిపించింది. ఈ మూవీకి సాయి పల్లవి బ్యాక్ బోన్"అంటూ హీరోయిన్ పై హీరో నితిన్ ప్రసంశించాడు.

Actor Nitin made interesting comments on Actress Sai Pallavi in Amaran movie success meet

ఇంత మాట్లాడూతూ.. 'సాయి పల్లవి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి ఏదైనా సినిమాలో డాన్స్ చేయాలని ఉంది. ఆమెతో డాన్స్ చేయడమంటే.. అది ఓ సవాల్ అని నాకు తెలుసు ' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో సాయి పల్లవి థ్యాంక్స్ చెప్పాగా.. 'నువ్వు నన్ను తినేస్తావ్. కానీ, అది హెల్తీ కాంపిటీషన్. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్' అంటూ సాయి పల్లవి పై హీరో నితిన్ ప్రశంసలు కురిపించారు.

ఆ తర్వాత.. డైరెక్టర్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. క్లైమాక్స్ లో తెరకెక్కించిన సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆ మూవీకి క్లైమాక్స్ లోని వార్ సీన్స్ హైలెట్ గా నిలిచాయని, డైరెక్టర్ టేకింగ్ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. గత నాలుగేళ్లుగా కార్తికేయన్‌‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నా.. కానీ నేరుగా కలవలేకపోయాను. ఎట్టకేలకు ఈ రోజు కలిసాను. ' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నితిన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

More from Filmibeat

Read more about: sivakarthikeyan sai pallavi nitin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X