మళ్లీ హాట్ హాట్‌గా రాశి రీ ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే.. !
అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్లలో రాశి ఒకరు. కెరీర్ పీక్‌లో ఉండగానే ప్రేమ వివాహం చేసుకొని సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు. తాజాగా మరోసారి తెలుగు తెరపై మ్యాజిక్ చేయడానికి రాశి సిద్ధమయ్యారు. తాజాగా శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం.
ఈ సందర్భంగా రాశి మాట్లాడుతూ ''చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్, ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, కె. అశోక్‌కుమార్, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, 'బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, ఆదిత్యా మీనన్, అన్నపూర్ణమ్మ తదితరులు
స్టంట్స్: సతీష్
కూర్పు: ఆవుల వెంకటేశ్
కళా దర్శకుడు: కె.వి. రమణ
మాటలు: అంజన్
ఛాయాగ్రహణం: హరీష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ పేరు: లైట్ హౌస్ సినీ మేజిక్
సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్ మారియో
నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి


Click it and Unblock the Notifications











