క్రేజీ డైరెక్టర్‌‌కు సమంత గ్రీన్ సిగ్నల్.. కెరీర్‌లో మైలురాయిగా నిలిచే పాత్రలో

గత రెండేళ్ల నుంచి అందాల తార సమంత అక్కినేని భారీ సక్సెస్‌లను చేజిక్కించుకొంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకొన్నారు. ఓ వైపు పాత్రలతో ప్రయోగాలు చేస్తూనే మరో వైపు గ్లామర్‌ను కూడా పండిస్తున్నది. తాజాగా సమంత నటించిన జాను సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జాను తర్వాత మరో భారీ ప్రాజెక్టుకు ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది.

మీడియా కథనాల ప్రకారం.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ సినిమాకు తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తున్నది.

Actor Samantha Akkineni in Ashwin Saravanan movie

అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రసన్న హీరోగా నటించనున్నట్టు సమాచారం. అయితే తాను అశ్విన్ సినిమాకు ఒకే చెప్పానని, కానీ పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించలేనని నిరాకరించినట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో ప్రారంభం అవుతుందని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. బలమైన కథ, కథనాలతో ఉండే ఈ సినిమా సమంత కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందనే మాట వినబడుతున్నది.

నయనతార నటించిన మాయ సినిమాతో డైరెక్టర్ అశ్విన్ శరవణన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తాప్సీ నటించిన గేమ్ ఓవర్ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X