twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రమ్ములా ఉండేది... సెక్సీగా మారి ఇండస్ట్రీ నోరెల్లబెట్టేలా చేసిన సారా అలీ ఖాన్!

    |

    బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్లో అడుగు పెట్టి వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తల్లిదండ్రుల నుంచి నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ కుర్ర బ్యూటీ తన అందం, చలాకీ మాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

    అయితే ఒకప్పుడు సారా అలీ ఖాన్ బరువు, రూపం చూసి ఆమె హీరోయిన్ అవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తాను అనుకున్నది సాధించి బరువు తగ్గి నాజూకుగా, అందంగా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

    అప్పుడు డ్రమ్ములా ఉండేదాన్ని

    అప్పుడు డ్రమ్ములా ఉండేదాన్ని

    ఒకప్పుడు సారా అలీ ఖాన్ రూపం డ్రమ్ములా ఉండేది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ తాజాగా సారా తన పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫోటోపై ఆమెతో కలిసి లవ్ ఆజ్ కల్ సీక్వెల్‌లో నటిస్తున్న, ఆమె ప్రియుడిగా వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్న కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ, "ఈ అమ్మాయి సారా అలీ లాగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

    ఫోటో చూసి ఆశ్చర్య పోతున్న ఫ్యాన్స్

    ఫోటో చూసి ఆశ్చర్య పోతున్న ఫ్యాన్స్

    కార్తీక్ మాత్రమే కాదు, ఆమె అభిమానులందరూ ఫోటో చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇలా మారడం వెనుక ఉన్న రహస్యం గురించి ఒక అభిమాని అడిగారు. "సో ప్రెట్రీ! మిమ్మల్ని మీరు ఇలా మార్చుకోవడానికి ఎంత డబ్బు, సమయం ఖర్చయింది. ఎంతలా కష్టపడ్డారు?"ఆమె కామెంట్ చేశారు. "ఇలా చేయడానికి చాలా గట్స్ కావాలి. మీరు ఎంతో మందికి స్పూర్తి." అని మరొకరు కామెంట్ పెట్టారు.

    అపుడు 90 కిలోల బరువు

    అపుడు 90 కిలోల బరువు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన కేదార్‌నాథ్ చిత్రంలో నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు సారా 90 కిలోల బరువును ఉండేది. ఆ సమయంలో ఆమె పిసిఓడి (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)తో బాధ పడుతూ ఉండేది. ఆ సమయంలో తాను బరువు తగ్గడానికి ఎంతాలా పోరాటం చేశానో వెల్లడిస్తూ గతంలో బిబిసికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

    సినిమాల్లోకి రావాలని అప్పుడే డిసైడ్ అయ్యాను

    సినిమాల్లోకి రావాలని అప్పుడే డిసైడ్ అయ్యాను

    "నేను కొలంబియాకు నాలుగు సంవత్సరాలు ఉండటానికి వెళ్ళాను, రెండవ సంవత్సరం చివరలో నటించాలని నిర్ణయించుకున్నాను, కానీ అపుడు నా బరువు 96 కిలోలు. ఇలా ఉంటే సినిమాల్లో కష్టం. అప్పటి నుంచి బరువు తగ్గడం మొదలు పెట్టాను'' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా చెప్పుకొచ్చారు.

    సారా అలీ ఖాన్

    సారా అలీ ఖాన్

    సారా అలీ ఖాన్ మొదటి చిత్రం ‘కేదార్‌నాథ్' కాస్త ఆలస్యం కావడంతో 2018 డిసెంబర్‌లో విడుదల కాగా, అదే నెలలోనే ఆమె తన తర్వాతి చిత్రం ‘సింబా' విడుదలైంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం సారా తొలి రూ .100 కోట్ల చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్.. ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న ‘లవ్ ఆజ్ కల్ సీక్వెల్' చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ నంబర్ 1' రీమేక్‌లో నటిస్తోంది.

    English summary
    Actor Sara Ali Khan has shared a throwback picture of herself clicked before her massive weight loss transformation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X