’బోల్డ్ సీన్స్‌లో నటించడం వల్ల వాళ్లు ఛీ కొట్టారు’

టాలీవుడ్ నటి శ్రీసుధ భీమిరెడ్డి .. ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. కానీ, 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్‌ స్పెషల్‌ స్నేహితురాలి పాత్రలో నటించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. 'ఐఫోన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి ఆమె తన నట ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించి మెప్పించింది. అలాగే.. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ చేసి సత్తా చాటింది. తాజాగా బోల్డ్ సీన్స్ లో నటించడంపై శ్రీ సుధ రెడ్డి (Sri Sudha) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నాదంటే?

తెలుగు నటి శ్రీ సుధ రెడ్డి.. పలు సినిమాల్లో హీరో, హీరోయిన్ల ఫ్రెండ్ రోల్స్‌, వాంప్ తరహా రోల్స్‌ లో నటించి.. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించి సినిమాల్లో బాడీగార్డ్, దమ్ము, ఎవరు, అవును , అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్, వలయం, వేర్ ద వెంకట లక్ష్మీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె సినీ నటి మాత్రమే కాదు.. ఫిజియోథెరపిస్ట్ కూడా . సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ మధ్యకాలంలో ఓ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కె. నాయుడు తనని మోసం చేశాడని, తనని ఫైనాన్సియల్ గా, ఫిజికల్ గా కూడా వాడుకున్నారని ఆరోపణలు చేస్తూ.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.

Actor Sri Sudha Reddy shocking comments on Bold Scenes

తాజాగా శ్రీ సుధ రెడ్డి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. తాను మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నానని తెలిపారు. అయితే.. ఇకపై తాను బోల్డ్ సీన్స్ నటించబోతననీ, అలాంటి పాత్రలకు చాలా దూరంగా ఉంటానన్నారు. తన సినిమాలను ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని, తాను నటించే పాత్రను ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు నటి సుధా. కెరీర్ మొదట్లో ఫేమస్ కావాలని.. తాను బోల్డ్ సీన్స్ లలో నటించానని తెలిపారు. అనుకున్నట్లు గానే బోల్డ్ సీన్స్ కు మాస్ ఆడియోస్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, అతి తక్కువ కాలంలోనే పాపులారిటీ వచ్చిందన్నారు.

కానీ, ఆ విషయంలో కాస్త బెడిసి కొట్టిందని, తాను తన ఫ్యామిలీకి దూరమయ్యానని బాధపడ్డారు. తాను నటించిన బోల్డ్ క్యారెక్టర్స్ ను తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చూడలేకపోతుందని, తన కొడుకు కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని, అందుకోసం తాను బోల్డ్ సీన్స్ లలో నటించడం మానేశానని, అసలు విషయం బయట పెట్టింది నటి సుధ. బోల్డ్ సీన్స్ నటించడం అనుకున్నట్లుగా అసభ్యకరంగా షూటింగ్ ఉండదని, నార్మల్ షూటింగ్ లాగానే బోల్డ్ సీన్స్ షూటింగ్ ఉంటుందన్నారు. కానీ, చూపించే విధానం కాస్త డిఫరెంట్ గా చూపించడంతో ఆ సీన్స్ ని తన ఫ్యామిలీ చూడలేక పోతున్నారని ఫీల్ అయ్యారు.

Actor Sri Sudha Reddy shocking comments on Bold Scenes

ఈ సమయంలో సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సమయంలో డెరెక్టర్ ఎంతో ఫ్రీగా.. కోఆపరేటివ్ గా ఉన్నారని ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ.. షూటింగ్ చేశారని తెలిపారు. అలాగే అర్జున్ రెడ్డి మూవీలో తాను నటించే సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ సీన్ లో తాను బోల్డ్ గా నటించలేదని, కానీ చూపించే విధానంలో కాస్త డిఫరెంట్ గా ఉండడంతో అది అసభ్యకరంగా కనిపిస్తుందని అన్నారు. అలా అనుకునేలా చేయడమే కదా సినిమా అన్నారు. ఏ పాత్రలో నటించినా.. ప్రేక్షకులను తమ నటనతో అట్రాక్ట్ చేయాలని, అది ఎమోషనల్ సీన్స్ లోనైనా రొమాన్స్ సీన్స్ నైనా ప్రేక్షకులను కదిలించే విధంగా ఉండాలనేదే తన అభిప్రాయమన్నారు.

More from Filmibeat

Read more about: sri sudha reddy arjun reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X