Don't Miss!
- Finance
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలిలా!!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మొన్న సల్మాన్ ఖాన్.. ఇప్పుడు స్వర భాస్కర్ కు బెదిరింపు లేఖలు.. ఈసారి అంత్యక్రియలే అంటూ!
పంజాబీ సింగర్ సిద్ధూ ముసేవాలా హత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మొన్నామధ్య సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్‌లకు బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పుడు తాజాగా నటి స్వర భాస్కర్‌కి కూడా బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖను ముంబైలోని తన ఇంటికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపినట్లు ఆమె తెలిపారు. స్వరకు అందిన లేఖలో ఆమెను హెచ్చరిస్తూ మీరు మీ సినిమాలకే పరిమితం కావాలని పేర్కొన్నారు. సావర్కర్‌ను అవమానిస్తే ఈ దేశ యువత సహించదు. మీ సినిమాలు మీరు చేసుకోండి లేకుంటే మీ అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ లేఖ చివరన ఈ దేశానికి చెందిన నౌజవాన్(యువత) పేరుతో జై హింద్ అని కూడా సంతకం చేశారు. లేఖ అందుకున్న స్వరా ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు.
స్వరా ఎప్పుడూ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఆమె 2017లో సావర్కర్ ను విమర్శిస్తూ ఒక పోస్ట్ చేశారు. అందులో సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పారని, జైలు నుంచి విడుదల చేయాలని కూడా వేడుకున్నట్లు పేర్కొన్న ఆమె అతడు హీరో కాదని రుజువైందని పేర్కొంది. 2019 సంవత్సరంలో కూడా, నటి స్వర సావర్కర్‌ను పిరికివాడు అని అంటూ అర్ధం వచ్చేలా కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ఇక మరోపక్క సల్మాన్ ఖాన్ను, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని అంటూ జూన్ 5 నాడు బెదిరింపు లేఖ వచ్చింది. ఈ బెదిరింపు లేఖను బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద సలీం ఖాన్ కాపలాదారు కనుగొన్నాడు.

సలీం తన మార్నింగ్ వాక్ తర్వాత కూర్చునే ఒక బెంచ్ వద్ద ఆ లేఖను ఉంచారు. మీడియా కథనాల ప్రకారం, సల్మాన్, సలీం ఖాన్‌ల పరిస్థితి సిద్ధూ మూసేవాలాలా తయారవుతుందని లేఖలో బెదిరించారు. అయితే పాపులారిటీ కోసం లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఈ బెదిరింపుకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇక 2010లో హృతిక్ రోషన్ నటించిన గుజారిష్ చిత్రంతో స్వర బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే, రంఝానాలోని బిండియా పాత్ర ద్వారా ఆమెకి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా స్వర తను వెడ్స్ మను, నిల్ బట్టే సన్నత, అనార్కలి ఆఫ్ ఆరా, ప్రేమ్ రతన్ ధన్ పాయో అలాగే వీరే ది వెడ్డింగ్‌లో కూడాకనిపించింది. ఇక సినిమాలే కాకుండా రాస్‌భారి, ఫ్లాష్ మరియు భాగ్ బిన్నీ భాగ్ అనే వెబ్ సిరీస్‌లలో స్వర కనువిందు చేసింది.