వివేక్ భౌతికదేహాన్ని చూసి కంటతడి పెట్టిన కీర్తీ సురేష్, త్రిషా, సిద్దార్థ.. తరలివచ్చిన కోలీవుడ్ ప్రముఖులు

ప్రముఖ నటుడు వివేక్ ఇకలేరనే వార్త తెలుసుకొన్న సినీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద ఉంచిన వివేక్ భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించారు. వివేక్ మరణం గురించి తలచుకొంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్‌లో వివేక్ గురించి తలచుకొంటూ..

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
నాకు అత్యంత ఇష్టమైన నటుడు

నాకు అత్యంత ఇష్టమైన నటుడు

వివేక్ గురించి కీర్తి సురేష్ ట్విట్టర్‌లో చెబుతూ.. నాకు అత్యంత ఇష్టమైన కమెడియన్ మనతో లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. సినీ పరిశ్రమలో లెజెండ్ అయిన ఆయనతో నటించే అవకాశం దక్కలేదు. కానీ ఆయనతో ఎన్నో అనుభూతులు పంచుకొన్నాను. ఆయన నాకు చెప్పిన విషయాలు ఎల్లకాలం నా మనసులో ఉండిపోతాయి అంటూ కీర్తి సురేష్ పేర్కొన్నారు.

ఆయనలో నైతిక విలువలు

ఆయనలో నైతిక విలువలు

వివేక్ ప్రతిభ గురించి ఎమోషనల్ అవుతూ.. ఎంతో మందికి తనదైన శైలిలో హాస్యాన్ని పంచారు. ఆయన నైతిక విలువలు ఎందరికో స్పూర్తిని కలిగిస్తాయి. ఈ తరం హాస్యనటుల్లో ఆయనలోని గొప్ప లక్షణాలు లేవు అంటూ కీర్తి సురేష్ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ట్వీట్లు చేసి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కమెడియన్ వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ తారలు.. కంటతడి పెట్టిన కీర్తి సురేష్

సామాజిక కార్యకర్తగా

సామాజిక కార్యకర్తగా

వివేక్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. సామాజిక కార్యకర్తగా పర్యావరణం కోసం పాటుపడ్డారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో లోటు ఏర్పడింది. ఆ లోటును ఎవరూ భర్తీ చేయడం కష్టమే. వివేక్‌నందన్ సార్.. మీరు ఎప్పుడూ మా గుండెల్లో ఉండిపోతారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు.

కీర్తి సురేష్ కంటతడి

చెన్నైలోని వివేక్ నివాసంలో చివరిచూపు కోసం ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. బరువెక్కిన విషాద హృదయంతో ప్రగాఢమైన సంతాపం వ్యక్తం చేసి కంటతడి పెట్టుకొన్నట్టు తెలిసింది. ఉద్విగ్నమైన క్షణాల మధ్య వివేక్‌ను కడసారి దర్శించుకొన్నారు.

విషాదంలో కోలీవుడ్.. భోరున ఏడ్చిన సిద్దార్థ్

విషాదంలో కోలీవుడ్.. భోరున ఏడ్చిన సిద్దార్థ్

వివేక్ పార్థీవ దేహాన్ని కడసారి దర్శించుకొన్న తమిళ ప్రముఖుల్లో శరత్ కుమార్, విక్రమ్, డైరెక్టర్ శంకర్, అర్జున్, సిద్దార్థ్, సూర్య, జ్యోతిక, కార్తీ, త్రిష తదితరులు ఉన్నారు. ఓ దశలో సిద్దార్థ్, త్రిష, కీర్తీ సురేష్ కంటతడి పెట్టుకొని శ్రద్దాంజలి ఘటించారు. భారీగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X