Yami Gautam మొన్నే పెళ్లి.. ఇంతలోనే చిక్కుల్లో, ఆ బ్యాంక్ అకౌంట్ వల్లేనా?
మొన్ననే పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టిన హీరోయిన్ యామీ గౌతమ్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే

చిన్నప్పటి నుంచే
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యామీ గౌతమ్ పెరిగింది మాత్రం చండీగఢ్లో. తండ్రి ముఖేష్ గౌతం పంజాబీలో ఒక ఫేమస్ ఫిలిం డైరెక్టర్. అలా చిన్నప్పటి నుంచి సినిమాలతోనే పెరిగిన ఈ భామ సినిమాల్లో 2009లో ఎంట్రీ ఇచ్చింది.. అయితే తండ్రి పంజాబీ డైరెక్టర్ అయినా సరే ఆమె ముందుగా ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో నువ్విలాతో
తర్వాత ఏక్ నూర్ అనే పంజాబీ సినిమాతో పంజాబీ సినీరంగంలో ప్రవేశించారు.. అదే ఏడాది తెలుగులో నువ్విలా అనే సినిమాలో అర్చన పాత్రలో నటించి తెలుగు వారికి దగ్గరయింది. అయితే ఇలా మూడు సినిమాలు చేసినా ఆమెకు రాని గుర్తింపు విక్కీడోనర్ సినిమాలో నటించడంతో దక్కింది. ఇక అదే ఏడాది హీరో అనే సినిమాతో ఆమె మలయాళ సినీ రంగంలోకి కూడా ప్రవేశించింది..

అన్ని బాషలలో నటించినా
అయితే ఇన్ని భాషల్లో నటించిన ఆమెకు హిందీలో వచ్చినంత గుర్తింపు మరే భాషలో లభించలేదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి అని భావించి ఇక్కడే గౌరవం, యుద్ధం ఏ సినిమాలు చేసింది.. తెలుగులో సినిమాలు చేస్తూనే హిందీలోను సినిమాలు కంటిన్యూ చేసింది. ఇక తెలుగులో కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో ఆమె చివరిగా నటించింది.

ఆ దర్శకుడితో పెళ్లి
హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తూ ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అక్కడ కాబిల్, సర్కార్ త్రీ, ఉరి ది సర్జికల్ స్ట్రైక్, గిన్నీ వెడ్స్ సన్నీ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. మరీ ముఖ్యంగా ఊరి సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేగాక ఆ సినిమా తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ధార్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి కూడా చేసుకుంది.

ఈడీ నోటీసులు
అయితే తాజాగా ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. యామి జూలై 7 న హాజరు కావాలని నోటీసులలో కోరారు. యామి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో కోటిన్నర విదేశీ మారక లావాదేవీలు జరిగాయి, ఆమె దీని గురించి అధికారులకు తెలియజేయలేదని తెలుస్తోంది. కొన్ని లావాదేవీలు స్కానర్ పరిధిలోకి వచ్చాయని, ప్రాథమిక దర్యాప్తు తర్వాత, బ్యాంకు ఖాతాలను యామి గౌతమ్‌తో అనుసంధానించినట్లు తేలిందని, ఆ తర్వాత సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











