నా బాడీలో ఆ పార్ట్ చూడాలట .. బట్టలు విప్పమన్నారు బలవంతంగా.. ఆమని షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలోని మహిళా నటుల దుస్థితిని వివరిస్తూ జస్టిస్ హేమ కమిటీ విడుదల చేసిన నివేదిక సినీ పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క మలయాళం మాత్రమే కాదని దేశంలోని అన్ని ఇండస్ట్రీలలోనూ ఇదే పరిస్ధితి నెలకొందని మహిళా నటులు ఆరోపిస్తున్నారు. హేమ కమిటీ నివేదిక బయటికి వచ్చాక ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు, ఇతర సహాయక పాత్రలు పోషించే నటులు సంచలన ఆరోపణలు చేశారు. హేమ కమిటీ మాదిరిగానే మాకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పలువురు హీరోయిన్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే చిత్ర పరిశ్రమలో వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అన్నవి ఇప్పుడే కొత్తగా వచ్చినవి కాదు. అవకాశాలు దక్కాలంటే ఆడపిల్లలు కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఎంతో మంది హీరోయిన్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ వేధింపులకు ఎంతో మంది వర్థమాన తారలు బలైపోగా.. కొందరు కెరీర్ కోసం లొంగిపోతున్నారు. అయితే కమిట్‌మెంట్‌కు నో చెప్పి.. అలా అడిగిన వారికి ఎదురు తిరిగిన నటీమణులు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్లలో ఆమని ఒకరు. అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కుటుంబ కథా చిత్రాలంటే ఏ దర్శకుడికైనా ముందుగా గుర్తొచ్చే పేరు ఆమని అన్నట్లుగా ఆమె నటన ఉండేది. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం, శుభమస్తు, వంశానికొక్కడు, శుభసంకల్పం వంటి హిట్ చిత్రాలతో ఆమని తనదైన ముద్ర వేశారు.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వాలని భావించింది. తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు . వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు స్వీకరించిన ఆమని సినిమాలకు దూరమయ్యారు. అయితే మనస్పర్థల కారణంగా ఆమని కొన్నాళ్లకే తన భర్తతో విడిపోయారు. ఆపై సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు.
ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమని.. ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు. కొత్త కొత్త సంస్థల్లో హీరోయిన్లకు వేధింపులు ఎక్కువగా ఉంటాయని.. ఓ సారి ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఉందని తెలిసి తల్లి, తమ్ముడిని తీసుకుని ఆడిషన్‌కి వెళ్లినట్లుగా ఆమని చెప్పారు. ఆ సమయంలో వారు నీకు తొడ మీద మచ్చలు ఉన్నాయని ప్రశ్నించారని.. ఆ మాటలతో తాను షాకైనట్లు ఆమని తెలిపారు.
ఇంతకు ముందు హీరోయిన్‌గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశామని.. కానీ ఆమెకు తొడపై మచ్చలు ఉన్నాయని, అందుకే నీకు కూడా ఉన్నాయా అని అడిగామని అందుకే ఒకసారి నీ తొడపై మచ్చలు ఉన్నాయో లేదో చూపించాలని వాళ్లు అడిగారని ఆమని వెల్లడించారు. ఆ మాటలతో తాను ఈ సినిమా చేయనని చెప్పి బయటికి వచ్చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెని అలా బట్టలు విప్పమని చెప్పింది ఎవరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











