విప్పి చూపించమన్నారు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన హీరోయిన్ ఆమని!

ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలోని చీకటి బాగోతాన్ని బయట పెడుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని తనకు జరిగిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. మరి ఇంతకీ ఆమెను డైరెక్ట్ గా విప్పి చూపించాలని అడిగిన వాళ్ళు ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇప్పుడే కాదు ఒకప్పటి కాలం నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమని చెప్పుకొచ్చింది. కాకపోతే అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు సోషల్ మీడియా లేదని, అందుకే బయటకు రాలేదని వెల్లడించింది. ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న విషయం జరిగినా ఇదిగో పిల్లి అంటే అదిగో పులి అనే రేంజ్ లో బయటకు వస్తోందని, కానీ అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదని గుర్తు చేసుకుంది.

Actress Aamani reveals bitter experience in the Audition for the movie

మరి ఇండస్ట్రీలో మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? అనే ప్రశ్నకు ఆమని స్పందిస్తూ తనకు కూడా అలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయని, ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నానని వివరించారు ఆమని. అందులో భాగంగానే అసలు అమ్మాయిలను వాడుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉంటారో కూడా చెప్పుకొచ్చారు.

సాధారణంగా పెద్ద కంపెనీల నుంచి కాల్ వస్తే ఇలాంటివేవీ ఉండవని, తనకైతే పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చినప్పుడు ఇలాంటి ఒక్క సంఘటన కూడా ఎదురు కాలేదని క్లారిటీ ఇచ్చింది. ఏదైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తే డైలాగ్ ఎలా చెప్తారు? డ్యాన్స్ ఎలా చేస్తారు? అంటూ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని, యాక్టింగ్ చేసి చూపించమంటారని ఈ సందర్భంగా వివరించింది ఆమని.

కానీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కొన్ని కొత్త ప్రొడక్షన్ హౌజ్ లు పుట్టుకొస్తాయని, వాటి గురించి తెలియక ఆడిషన్ కి వెళ్తే బలవ్వడం ఖాయమని చెప్పుకొచ్చింది ఆమని. తనకు కూడా ఇలాగే ఓ ప్రోడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తే వెళ్లానని, అక్కడికి వెళ్ళాక వాళ్ళు హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి టూ పీస్ డ్రెస్ ధరించాలని అన్నారనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

అయితే తీరా దానికి ఒప్పుకుంటే మీకు అక్కడ స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఉంటాయి కదా? అలాంటివి ఉన్నాయా అని అడిగారట. దీంతో ఆమని అలాంటివి నాకెందుకు ఉంటాయండి అని ఎదురు ప్రశ్నించారట. కానీ వాళ్ళు అక్కడితో ఆగకుండా లేదండి ఇంతకు ముందు ఇలాగే జరిగింది. తెలియకుండానే ఓ అమ్మాయిని తీసుకున్నాము. తీరా వర్క్ స్టార్ట్ చేశాక అసలు విషయం తెలిసింది అని అన్నారట.

అంతేకాకుండా ఒకసారి మీరు విప్పి చూపించండి అని అడిగారట. దీంతో షాక్ అయిన ఆమని అలా ఎలా తీసి చూపిస్తారండి? ఇది వర్కౌట్ కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి తరచుగా ఎదురవుతాయని, కానీ మనం ఎంచుకునే మార్గాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చింది ఆమని. మొత్తానికి ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలోకి వచ్చే న్యూ కామర్స్ కి బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X