‘సీతారామం’ నటి అభినయ నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా?
నటి అభినయ.. టాలెంటెడ్ యాక్రెస్ట్. తనకు మాట, వినికిడి శక్తి లేకపోయినా టాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. తమిళనాడుకు చెందిన ఈమె ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనూ వరుసగా మెరుస్తోంది. పలు కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2008లో తెలుగులో వచ్చిన 'నేనింతే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతోనే తన కెరీర్ ప్రారంభమైంది. ఆ చిత్రంలో అభినయ చిన్న పాత్రలో కనిపించారు. ఇక నేనింతే సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
15 ఏళ్లుగా నటి అభినయ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక నటి అభినయ సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తాగా ఓ గుడ్ న్యూస్ ను తన ఫ్యాన్స్ కు తెలియజేసింది.

ఉగాది పండగు సందర్భంగా అందరికీ నటి అభినయ శుభవార్త తెలిపింది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఇదే నెల మార్చి 9న ఆదివారం తనకు ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందని చెప్పింది. తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన పెళ్లి కబురు తెలియ జేసింది. నటి అభినయ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి హైదరాబాద్ వాసి కావడం విశేషం. ఆయన పేరు కార్తీక్. ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి ఎంగేజ్ మెంట్ లో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే, నటి అభినయ తన కెరీర్ లో మంచి పేరు సంపాదించుకుంది. పలు కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే మాట రాకున్నా, చెవి వినపడకపోయినా కెరీర్ లో సక్సెస్ అయినందుకు ఇప్పటికే ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి. కాగా, ఆమె వ్యక్తిగత జీవితంలోనూ పెళ్లితో మరో మంచి అడుగు పడబోతుండటంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆమె ఎంగేజ్ మెంట్ ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక కార్తీక్ కు తనతో ఎంగేజ్ మెంట్ కు ఈజీగా ఒప్పుకున్నారని అభినయ తన పోస్ట్ తో చెప్పడంతో ఆయనను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
ఇక హైదరాబాద్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వీరి నిశ్చితార్థపు వేడుక అతి సన్నిహితుల మధ్య జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని, అందుకు సంబంధించిన ప్రకటన కూడా రానుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా నటి అభినయ పెళ్లి చేసుకోబోతుండటం అందరూ సంతోషిస్తున్నారు. ఇక ఆమె ఎంగేజ్ మెంట్ పోస్ట్ కు స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా స్పందించింది. లైక్ కొట్టి వారికి విషెస్ తెలిసిందే. ఇక అభినయ తెలుగులో ఇప్పటి వరకు నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఇక తమిళంలో ఆమె నటించిన 'నాడోడిగల్' చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది.


Click it and Unblock the Notifications











