‘కమల్‌తో లిప్‌లాక్ వెనుక అసలు కథ అదే.. ఆ బోల్డ్ సీన్‌ను తెర మీద చూస్తేనే.. ’
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న థగ్ లైఫ్ చిత్రం రిలీజ్‌కు ముందు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఈ సినిమాలోని ముద్దు సీన్ల గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది. యంగ్ హీరోయిన్లతో 70 ఏళ్ల కమల్ హాసన్ గాఢంగా ముద్దులు ఎలా పెట్టుకొంటారు? అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అనేక ప్రశ్నలను, వివాదాన్ని రేపుతున్నాయి. ఇద్దరు హీరోయిన్లతో ముద్దు సీన్ల గురించిన అంశంపై నటి అభిరామి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. జూన్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోని హాట్ హాట్ ముద్దు సీన్ల గురించి ఆమె ఏమన్నారంటే?
ఇటీవల రిలీజైన థగ్ లైఫ్ ట్రైలర్‌ను చూస్తే.. అందులో యాక్షన్, ఎమోషన్స్, పగ, ప్రతీకారం లాంటి ఎన్నో అంశాలతోపాటు హీరోయిన్లతో లిప్‌లాక్స్ కూడా హైలెట్‌గా కావడమే కాకుండా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. అయితే సీనియర్ హీరో కమల్, త్రిషా కృష్ణన్, అలాగే అభిరామితో కలిసి నటించిన ముద్దు సీన్ల గురించి రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలోను, మీడియాలోను వెల్లువెత్తాయి. అయితే తాను కమల్ కలిసి నటించిన 3 సెకన్లపాటు ఉండే లిప్ లాక్ గురించి సీనియర్ నటి అభిరామి మాట్లాడుతూ.. అందులో అసభ్యత, అశ్లీలత ఏమీ ఉండదు అని హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

ట్రైలర్‌లో చూపించిన ముద్దు సీన్ కేవలం 3 సెకన్లు మాత్రమే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే?. మీరు ఊహించినట్టుగా ఏదో జరిగిపోలేదు. ట్రైలర్‌లో చూస్తే కొంత ఆడియెన్‌ను తప్పుదారి పట్టించేలా ఉంటుంది. మీరు సినిమాలో బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు అసలు విషయం బోధపడుతుంది. ఏ సందర్భంలో ఆ కిస్ సీన్ వస్తుంది? ఎందు కోసం దానిని పెట్టారు? ఆ సందర్భాన్ని బట్టి చూస్తే మీకు ఎలాంటి తప్పు, ఎబ్బెట్టుగా అనిపించదు అని అభిరామి అన్నారు.
అయితే కమల్ హాసన్ సినిమాల్లో ముద్దు సీన్లు కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో సినిమాల్లో ఇలాంటి సీన్లు ఉన్నాయి.హేరామ్ సినిమాలో రాణి ముఖర్జీతో లిప్ లాక్, అలాగే వసుంధర దాస్‌తో కూడా ముద్దు సీన్లు ఉన్నాయి. కమల్ సార్ సినిమాలో ముద్దు సీన్లు ఉండే ట్రాక్ రికార్డు ఉంది.మేము కొత్తగా ముద్దు సీన్లలో ఆయనతో నటించలేదు. తాజాగా మేము ఆ సీన్లలో నటించాం కాబట్టి మీకు కొత్తగా వింతగా అనిపించవచ్చు అని ఆమె అన్నారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్లు కామన్ అయిపోయాయి. అయితే వాటిని మరో ఉద్దేశంతో కాకుండా వినోదం కోణంలోనే చూడాలి. ఇక సినిమాను ప్రమోట్ చేసేందుకు మార్కెటింగ్ టీమ్స్ ఇలాంటి సన్నివేశాలను హైలెట్ చేసి ప్రేక్షకుల దృష్టిని మరలస్తున్నారు.అయితే ట్రైలర్‌లో వచ్చే సీన్లను చూసి ముగింపు నిర్ధారణకు రాకూడదు. అలా ఆలోచిస్తే.. ఇలాంటి వివాదాలు, ప్రశ్నలు వస్తాయి అని అభిరామి అన్నారు.
లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ చెన్నైలో జరిగింది.అప్పటి నుంచి ఈ ముద్దుల వివాదం మీడియాలో గోలగా మారింది.


Click it and Unblock the Notifications











