పేపర్ డ్రెస్సులో పిచ్చెక్కించిన అదా శర్మ... అందరి చూపు అక్కడే!
Recommended Video

'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూస్ పేపర్లతో తయారైన డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసి ఆశ్చర్య పరిచింది.
ముంబైలో బుధవారం రాత్రి జరిగిన నైకా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో పాల్గొన్నన్న ఆమె రెడ్ కార్పెట్ మీద ఈ వింత డ్రెస్సుతో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. అదా క్లీవేజ్ షో అభిమానుల మతి పోగొడుతోంది.

‘అహనా పెళ్లంట' మూవీని గుర్తు చేసుకుంటున్న తెలుగు ఫ్యాన్స్
అదా శర్మ ధరించిన న్యూస్ పేపర్ డ్రెస్ డిజైన్ చూడగానే తెలుగు ప్రేక్షకులంతా జంధ్యాల మూవీ ‘అహనా పెళ్లంట' గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదా శర్మ ఈ పేపర్ డ్రెస్సు వేసింది మాత్రం డబ్బు ఆదాచేయడం కోసం కాదండోయ్!

ప్రత్యేకంగా కనిపించాలనే
నైకా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుకలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలనే అదా శర్మ ఈ వింత డ్రెస్సు ధరించింది. పేపర్ చిరిగిపోతే ఎలా? అనే డౌట్స్ మాత్రం రానీయకండి.. ఎందుకంటే అది రియల్ పేపర్ కాదు, పేపర్ మాదిరిగా కనిపించే ప్రింటెడ్ క్లాత్‌తో ఈ డ్రెస్ డిజైన్ చేశారట.

అదా శర్మ
విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘1920' అనే హిందీ హారర్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అదా శర్మ... తెలుగులో పూరి జగన్నాధ్ -నితిన్ మూవీ ‘హార్ట్ ఎటాక్' చిత్రంలో నటించింది.

స్టైల్ స్టేట్మెంటుతో హాట్ టాపిక్
‘హార్ట్ ఎటాక్' తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం చిత్రాల్లో నటించిన అదా శర్మ.. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ‘కల్కి'లో నటిస్తోంది. స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లక పోయినా తన స్టైల్ స్టేట్మెంటుతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.


Click it and Unblock the Notifications











