నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం ఏదో ఒక కారణంతో కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటూ కనుమరుగు అవుతున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి ఆదా శర్మ ఒకరు. మొదటి చిత్రంతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోలేకపోయింది. ఫలితంగా ఆఫర్లు లేక టాలీవుడ్‌కు దూరమైంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆదా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ పిక్ వదిలింది. అది మీకోసమే!

చిన్న వయసులోనే మొదలెట్టి
చదువుకునే రోజుల్లోనే అంటే 16 సంవత్సరాల వయసులోనే ఆదా శర్మ సినిమాల్లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో వచ్చిన '1920' అనే సినిమాతో ఆమె నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది. దీంతో ఈ అమ్మడు అప్పుడే అందరి దృష్టిలో పడి పాపులర్ అయింది.

హార్ట్ ఎటాక్ తెప్పిస్తూ ఎంటర్
'1920' సినిమా తర్వాత యాక్టింగ్‌కు గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లోనూ చేసింది. ఇక, 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకుని సత్తా చాటుకుంది.

ఆ చిత్రాల్లో.. క్షణంతో సక్సెస్
'హార్ట్ ఎటాక్' మూవీ తర్వాత ఆదా శర్మకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది చూడకుండా ఆమె వరుసగా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలు చేసింది. కానీ, ఆ తర్వాత తేరుకున్న ఆదా శర్మ 'క్షణం' అనే సినిమా చేసి కెరీర్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇప్పుడలానే చేస్తోన్న ఆదా
ఆదా శర్మకు గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా దక్కడం లేదు. దీంతో మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను చక్కగా నడుపుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. దీంతో ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయకున్నా ప్రభావాన్ని కోల్పోవట్లేదు.

సోషల్ మీడియాలో బిజీగానే
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదా శర్మ.. ఈ మధ్య కాలంలో అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలతో రెచ్చగొడుతూనే
సుదీర్ఘ కాలంగా ఆదా శర్మ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె పొట్టి డ్రెస్‌లలో ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆమె హైలైట్ అవుతోంది.

యమ హాట్ పిక్ వదిలిందిగా
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మితిమీరిన హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒకదానిలో మాత్రం ఆదా ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించింది. అయితే, జుట్టుతో ఎద భాగాన్ని కవర్ చేసినా.. ఈ పిక్‌కు హైలైట్ అవుతోంది. ఇక, ఈ పోస్టులో ఈ ఫొటోల్లో మీ ఫేవరెట్ ఏది అని అడిగిందామె.


Click it and Unblock the Notifications











