పైట తీసి.. మల్లెపూలతో రెచ్చగొడుతోన్న ఆదా శర్మ: ఇలా చూపిస్తూ కుర్రాళ్లు ఆగుతారా!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా.. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి ఆదా శర్మ ఒకరు. మొదటి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను పడేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత కెరీర్‌ను చక్కగా నడుపుకోలేకపోయింది. కానీ, తన రేంజ్‌లో ముందుకు సాగుతోంది. ఇక, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయని ఆదా.. సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

టీనేజ్‌లో స్టార్ చేసేసింది

టీనేజ్‌లో స్టార్ చేసేసింది

చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టాన్ని పెంచుకున్న ఆదా శర్మ.. తన 16వ ఏటనే '1920' అనే బాలీవుడ్ మూవీతో ఆమె నటిగా కెరీర్‌ను మొదలు పెట్టేసింది. ఈ మూవీలో అదిరిపోయే యాక్టింగ్‌ను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేషన్‌ను పొందింది. దీంతో ఈ అమ్మడు అప్పట్లోనే ఫేమస్ అయింది. తద్వారా దేశ వ్యాప్తంగా అందరి దృష్టిలో పడింది.

హార్ట్ ఎటాక్ అంటూ వచ్చి

హార్ట్ ఎటాక్ అంటూ వచ్చి

ఫస్ట్ మూవీ చేసిన తర్వాత చదువును కంప్లీట్ చేసుకున్న ఆదా శర్మ.. కొంత గ్యాప్ తర్వాత మరో రెండు బాలీవుడ్ మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే 2014లో 'హార్ట్ ఎటాక్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన దీనిలో నితిన్ హీరోగా నటించాడు. ఈ మూవీలో ఆదా శర్మ అందంతో పాటు యాక్టింగ్‌లో ఆకట్టుకుని ఫేమస్ అయింది.

ఎన్నో మూవీలు.. క్షణమే

ఎన్నో మూవీలు.. క్షణమే


'హార్ట్ ఎటాక్' మూవీ తర్వాత ఆదా శర్మకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ చిన్నది వచ్చిన ప్రతి దాన్ని చేసుకుంటూ వెళ్లింది. ఇలా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాలు చేసింది. ఇవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. దీంతో ఆదా శర్మ కెరీర్ ముగుస్తుందనుకున్న సమయంలోనే 'క్షణం'తో భారీ విజయాన్ని దక్కించుకుంది.

పెద్దగా చేయట్లే.. వాటిలో

పెద్దగా చేయట్లే.. వాటిలో


చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఆదా శర్మకు ఈ మధ్య పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కానీ, గత ఏడాది ఆమె 'మీట్ క్యూట్' అనే తెలుగు వెబ్ ఫిల్మ్‌లో చేసింది. ఇక, ఈ ఏడాది ఇప్పటికే 'సెల్ఫీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడేమో The Kerala Story అనే చిత్రంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ ఆదా నటిస్తోంది.

అందులో మాత్రం రచ్చ

అందులో మాత్రం రచ్చ

చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏకధాటిగా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసుకుంటూ వచ్చిన ఆదా శర్మ.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అందాలను దాచకుండా

అందాలను దాచకుండా

ఆదా శర్మకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ ఉండడమే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ చిన్నది తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆదా శర్మ ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ ట్రెండింగ్ అవుతోంది.

ఆదా ఫొటోలు వైరల్‌గా

ఆదా ఫొటోలు వైరల్‌గా

సోషల్ మీడియాలో శృతి మించి మరీ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె పైట (చున్నీ) తీసేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, తల్లో మల్లెపూలు పెట్టుకుని రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆదా శర్మ పిక్స్‌కు భారీ స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్‌ అయిపోతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X